Telugu Global
NEWS

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే.... మంత్రి వర్గంలో భారీ మార్పులు

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ లో గులాబీ పార్టీ గుభాళిస్తుందని తేటతెల్లమైంది. మరి కేసీఆర్ సర్కారు మరోసారి గద్దెనెక్కితే పోయిన బ్యాచ్ కే మంత్రి పదవులు దక్కుతాయా..? ఈసారి మార్పులుంటాయా.? తెలంగాణ ఉద్యమకారులను కాదని.. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చాడనే అపప్రద ఆయన్ను నాలుగేళ్లుగా వెంటాడుతోంది. మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన వేళ కేసీఆర్ స్వచ్ఛమైన ఉద్యమకారులకు మంత్రి పదవులు ఇస్తారా.? ఇస్తే ఎవరికి ఇస్తారు.? అనేది హాట్ టాపిక్ గా […]

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే.... మంత్రి వర్గంలో భారీ మార్పులు
X

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ లో గులాబీ పార్టీ గుభాళిస్తుందని తేటతెల్లమైంది. మరి కేసీఆర్ సర్కారు మరోసారి గద్దెనెక్కితే పోయిన బ్యాచ్ కే మంత్రి పదవులు దక్కుతాయా..? ఈసారి మార్పులుంటాయా.? తెలంగాణ ఉద్యమకారులను కాదని.. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చాడనే అపప్రద ఆయన్ను నాలుగేళ్లుగా వెంటాడుతోంది.

మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన వేళ కేసీఆర్ స్వచ్ఛమైన ఉద్యమకారులకు మంత్రి పదవులు ఇస్తారా.? ఇస్తే ఎవరికి ఇస్తారు.? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలంగాణ బరిలో నిలిచిన పలువురు మంత్రులు కూడా ఈసారి ఓటమి అంచున ఉండడంతో వారికి మంత్రి పదవి యోగమే కాదు.. కనీసం ఎమ్మెల్యే గిరి కూడా దక్కదనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో ఉరకలెత్తి… అరెస్ట్ అయ్యి జైలుపాలైన ఎంపీ బాల్క సుమన్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ లకు ఈసారి మంత్రి పదవులు ఖాయమని వార్తలొస్తున్నాయి. మంత్రి కేటీఆర్ కు బాగా సన్నిహితులైన వీరిద్దరికీ మంత్రి పదవులు ఇప్పిస్తాడనే ప్రచారం టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఈసారి మంత్రివర్గంపై విమర్శలు రాకుండా ఉండాలని కేసీఆర్ ఉద్యమకారులు, మహిళలకు మంత్రి పదవులు ఇవ్వాలని దాదాపు నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా నుంచి గెలిస్తే గొంగడి సునీతకు పదవీ యోగం ఉంటుందట.

ఇక నిర్మల్ ఎమ్మెల్యే కం మంత్రి అయిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి గెలవడం కష్టమని పోలింగ్ ముగిశాక వార్తలొస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న జోగురామన్న పరిస్థితి కూడా బాగా లేదట. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ గెలిచానా, ఓడినా ఈసారి మంత్రి పదవి కష్టమనే వాదన వినిపిస్తోంది. వీరి స్థానంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి పోటీచేస్తున్న దళిత సామాజికవర్గానికి చెందిన బాల్క సుమన్, ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కోవలక్ష్మికి లేదా ఎస్టీ నియోజకవర్గం ఖానాపూర్ నుంచి పోటీచేస్తున్న అజ్మీరా రేఖానాయక్ కు మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారట.

ఇలా కేసీఆర్ సరికొత్త మంత్రివర్గాన్ని ఈసారి ఆవిష్కరించబోతున్నారని… మంత్రివర్గంలో మహిళలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలకు అందులోనూ ఉద్యమకారులకే పదవులు ఇస్తున్నారని టీఆర్ఎస్ నుంచి వార్తలు లీక్ అవుతున్నాయి.

దీనికి తోడు కొందరు మంత్రులకు కేసీఆర్ టార్గెట్ పెట్టాడని, ఉత్తినే వాళ్ళ నియోజక వర్గం ఒక్కటే గెలిస్తే సరిపోదని కొందరు మంత్రులకు మరో ఒకటి, రెండు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను అప్పగించాడని…. తను గెలవడమే కాకుండా వాటిలో పార్టీ అభ్యర్ధులను గెలుపించుకొస్తేనే మంత్రి పదవి అని షరతు విధించాడని…. అలా గెలిపించుకు రాలేని వాళ్ళకు ఈసారి మంత్రి పదవులు లేవని అంటున్నారు.

అలాగే ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కూడా మూడు నియోజకవర్గాల బాధ్యత అప్పగించాడని వాటిలో పార్టీ అభ్యర్ధులను గెలుపించుకు వస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని చెప్పాడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

First Published:  8 Dec 2018 6:26 AM GMT
Next Story