Telugu Global
Cinema & Entertainment

చిట్టి రోబోకు పోటీగా ఆక్వామేన్

భారీ బడ్జెట్ తో త్రీడీలో తెరకెక్కిన 2.0 సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాను రెగ్యులర్ గా కంటే, 3డీలోనే చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు పోటీగా మరో మూవీ కూడా రెడీ అయింది. అదే ఆక్వామేన్. బేసిగ్గా ఇదొక హాలీవుడ్ సినిమా. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను అమెరికా కంటే వారం ముందుగా ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఇలాంటి డబ్బింగ్ సినిమాలు రజనీకాంత్ కు అస్సలు […]

చిట్టి రోబోకు పోటీగా ఆక్వామేన్
X

భారీ బడ్జెట్ తో త్రీడీలో తెరకెక్కిన 2.0 సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాను రెగ్యులర్ గా కంటే, 3డీలోనే చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు పోటీగా మరో మూవీ కూడా రెడీ అయింది. అదే ఆక్వామేన్.

బేసిగ్గా ఇదొక హాలీవుడ్ సినిమా. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను అమెరికా కంటే వారం ముందుగా ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఇలాంటి డబ్బింగ్ సినిమాలు రజనీకాంత్ కు అస్సలు పోటీకావు. కానీ అక్వామేన్ మాత్రం కచ్చితంగా పోటీలో నిలుస్తుంది. ఎందుకంటే ఇది కూడా త్రీడీలో వస్తోంది కాబట్టి. పైగా ఈ సినిమాను త్రీడీలోనే చూసి ఆనందించాలని మేకర్స్ పదేపదే చెబుతున్నారు.

సముద్ర గర్భంలో తీసిన సన్నివేశాల్ని త్రీడీలో చూస్తే, ప్రేక్షకుడికి కూడా సముద్రం అడుగున ఉన్న ఫీలింగ్ వస్తుందని చెబుతున్నారు. అది నిజమే… ఇప్పటివరకు ఎన్నో 3డీ సినిమాలొచ్చాయి. కానీ ఇలా నీటి అడుగు భాగాన్ని త్రీడీలో చూసే అవకాశం పెద్దగా రాలేదు. ఆక్వామేన్ సినిమా ఆ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. ఈ సినిమా త్రీడీ వెర్షన్ క్లిక్ అయితే మాత్రం, ఎక్కువమంది 2.0 కంటే ఆక్వామేన్ కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది.

First Published:  3 Dec 2018 10:36 PM GMT
Next Story