Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ డైరెక్టర్ తో నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం “మజిలి” “వెంకీ మామ” సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో “మజిలి” షూటింగ్ మొదలవగా “వెంకీ మామ” షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఇకపోతే ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసాడట నాగ చైతన్య. “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” “ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాలతో హిట్స్ అందుకున్న మేర్లపాక గాంధీ ఈ ఏడాది మాత్రం “కృష్ణార్జున యుద్ధం” సినిమాతో […]

ఫ్లాప్ డైరెక్టర్ తో నాగ చైతన్య
X

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం “మజిలి” “వెంకీ మామ” సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో “మజిలి” షూటింగ్ మొదలవగా “వెంకీ మామ” షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఇకపోతే ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసాడట నాగ చైతన్య.

“వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” “ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాలతో హిట్స్ అందుకున్న మేర్లపాక గాంధీ ఈ ఏడాది మాత్రం “కృష్ణార్జున యుద్ధం” సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయిన తరువాత చాలా మంది హీరోలని కలిసి కథ చెప్పాడుట మేర్లపాక గాంధీ.

కానీ నాగ చైతన్య కి మాత్రమే మేర్లపాక గాంధీ చెప్పిన లైన్ నచ్చి పూర్తి కథ డెవలప్ చేసుకొని రమ్మనాడట. మరి మేర్లపాక గాంధీ పూర్తి కథ రెడీ చేసుకొని నాగార్జునకి కూడా కథ చెప్పేస్తే ఇక సినిమా ట్రాక్ ఎక్కినట్టే. ఈ విషయం పై డైరెక్టర్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

First Published:  3 Dec 2018 12:04 AM GMT
Next Story