Telugu Global
NEWS

నేనే విల్లును.... జేపీకి షాక్ ఇచ్చిన మాజీ జేడీ

ఎందుకో గానీ… అనుకున్నట్టు జరగలేదు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబు వదిలిన బాణం అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో…. ఆయన లోక్‌సత్తా పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం మరింత చర్చకు దారి తీసింది. మాజీ జేడీ లోక్‌సత్తాలో చేరే ముహూర్తంపై కూడా వార్తలొచ్చాయి . అయితే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని లక్ష్మీనారాయణ ప్రకటించారు. లోక్‌సత్తాలోకి రావాల్సిందిగా జేపీ ఆహ్వానించినా జేడీ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. తానే సొంతంగా […]

నేనే విల్లును.... జేపీకి షాక్ ఇచ్చిన మాజీ జేడీ
X

ఎందుకో గానీ… అనుకున్నట్టు జరగలేదు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబు వదిలిన బాణం అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో…. ఆయన లోక్‌సత్తా పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం మరింత చర్చకు దారి తీసింది. మాజీ జేడీ లోక్‌సత్తాలో చేరే ముహూర్తంపై కూడా వార్తలొచ్చాయి .

అయితే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని లక్ష్మీనారాయణ ప్రకటించారు. లోక్‌సత్తాలోకి రావాల్సిందిగా జేపీ ఆహ్వానించినా జేడీ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. తానే సొంతంగా పార్టీ పెడతానని చెప్పారు. తానుపెట్టే పార్టీని రెండు రాష్ట్రాలకే పరిమితం చేయబోనన్నారు.

చంద్రబాబు వదిలిన బాణం అంటూ జరుగుతున్న ప్రచారంపైనా మాజీ జేడీ స్పందించారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదన్నారు. ”నేనే ఒక విల్లును…. నేను బాణాలను సంధిస్తాను” అని చెప్పారు.

సోమవారం ఆయన అభిమానులు, పలు రంగాల మేధావులతో పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సమావేశమయ్యారు. కొత్తపార్టీ ఏర్పాటుపై చర్చించారు. తన పార్టీకి ఇంకా ఎలాంటి పేరూ అనుకోలేదని, సలహాలూ, సూచనలూ ఆహ్వానిస్తున్నానని చెప్పారు. తన విధివిధానాలు నచ్చి ముందుకొచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.

First Published:  26 Nov 2018 10:30 PM GMT
Next Story