Telugu Global
Cinema & Entertainment

చిరు చిన్నల్లుడిని రిజెక్ట్ చేసిన ప్రియ వారియర్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరో కళ్యాణ్ దేవ్. మెగా స్టార్ చిరంజీవి అల్లుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి “విజేత” సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఆ ఫ్లాప్ తరువాత ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పులి వాసు అనే సీరియల్ డైరెక్టర్ తో జత కట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్  పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కి […]

చిరు చిన్నల్లుడిని రిజెక్ట్ చేసిన  ప్రియ వారియర్
X

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరో కళ్యాణ్ దేవ్. మెగా స్టార్ చిరంజీవి అల్లుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి “విజేత” సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.

ఆ ఫ్లాప్ తరువాత ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పులి వాసు అనే సీరియల్ డైరెక్టర్ తో జత కట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కి హీరోయిన్ గా క్రేజీ సెన్సేషనల్ స్టార్ ప్రియ వారియర్ ని సంప్రదించారట సినిమా యూనిట్.

కానీ ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదు అంటూ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది ప్రియ. స్టార్ హీరో కాకపోవడం, పారితోషకం విషయంలో రిజెక్ట్ చేసినట్లు కొందరు చెబుతున్నారు.

First Published:  26 Nov 2018 6:09 AM GMT
Next Story