Telugu Global
NEWS

ఎన్టీఆర్‌ టికెట్లు ఇచ్చేప్పుడు బిక్షగాళ్లను చూసినట్టు చూశారు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్… ఎన్టీఆర్‌ హయాం నాటి పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ నేతల పరిస్థితి గుడి వద్ద బిక్షగాళ్ల తరహాలో ఉండేదన్నారు. అందుకు 1989లో జరిగిన ఒక సంఘటనను వివరించారు. 1989 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఆఫీస్‌ నుంచి తనకు టికెట్ ఖరారైనట్టు ఫోన్ వచ్చిందన్నారు. బీఫాం తీసుకెళ్లాల్సిందిగా చెప్పారన్నారు. ఇంటి వద్ద ఇస్తారా అని అడిగితే…. లేదు, నాచారంలోని స్డూడియో వద్దకు రావాల్సిందిగా ఎన్టీఆర్‌ ఆఫీస్‌ సిబ్బంది చెప్పారన్నారు. తాను […]

ఎన్టీఆర్‌ టికెట్లు ఇచ్చేప్పుడు బిక్షగాళ్లను చూసినట్టు చూశారు
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్… ఎన్టీఆర్‌ హయాం నాటి పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ నేతల పరిస్థితి గుడి వద్ద బిక్షగాళ్ల తరహాలో ఉండేదన్నారు. అందుకు 1989లో జరిగిన ఒక సంఘటనను వివరించారు.

1989 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఆఫీస్‌ నుంచి తనకు టికెట్ ఖరారైనట్టు ఫోన్ వచ్చిందన్నారు. బీఫాం తీసుకెళ్లాల్సిందిగా చెప్పారన్నారు. ఇంటి వద్ద ఇస్తారా అని అడిగితే…. లేదు, నాచారంలోని స్డూడియో వద్దకు రావాల్సిందిగా ఎన్టీఆర్‌ ఆఫీస్‌ సిబ్బంది చెప్పారన్నారు.

తాను అక్కడికి వెళ్లగా… తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు గుడి మెట్ల వద్ద బిక్షగాళ్ల తరహాలో కూర్చున్నారని… ఆ సన్నివేశం చూసి కళ్లలో నీరు వచ్చిందన్నారు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ముందు టికెట్లు ఇచ్చేసి…. తెలంగాణ వారికి మాత్రమే ఆఖరిలో ఇచ్చేవారని కేసీఆర్‌ చెప్పారు.

టికెట్ల కోసం వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బిక్షగాళ్ల తరహాలో ఎదురు చూడడం చూశాక తనకు చాలా బాధేసి తెలంగాణకు నాయకుడంటూ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని హరీశ్వర్‌ రెడ్డి లాంటి వారి వద్ద వ్యాఖ్యానించానన్నారు.

ఆ రోజు రాత్రి కూడా తెలంగాణ నేతలందరూ కలిసినప్పుడు కనీసం నాలుగు కుర్చీలు, ఒక టెంట్ కూడా వేయకుండా గుడివద్ద బిక్షగాళ్లను చూసినట్టు చూసినందుకు బాధపడ్డామని కేసీఆర్‌ వివరించారు.

ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభిద్దామంటే ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేదన్నారు. ఇక చంద్రబాబు పాలన వచ్చాక చావో బతుకో ఏదో ఒకటి తేలుతుందని… తానే ధైర్యంగా తెలంగాణ నినాదం అందుకున్నానని కేసీఆర్‌ వివరించారు.

First Published:  26 Nov 2018 12:12 AM GMT
Next Story