Telugu Global
Cinema & Entertainment

ఐటెంసాంగ్ ఓకే కానీ....?

అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ అయినా ఇలియానాకు మాత్రం కలిసొచ్చినట్టే ఉంది. కాస్త కండ పట్టి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇలియానాకు టాలీవుడ్ మేకర్స్ ఫిదా అవుతున్నారు. వరుసపెట్టి ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఓ క్రేజీ ఆఫర్ గోవా బ్యూటీ చెంతకు వచ్చింది. కానీ దానికి ఇల్లీ బేబీ నో చెప్పింది. మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ”వినయ విధేయ రామ” అనే సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ మూవీలో ఓ […]

ఐటెంసాంగ్ ఓకే కానీ....?
X

అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ అయినా ఇలియానాకు మాత్రం కలిసొచ్చినట్టే ఉంది. కాస్త కండ పట్టి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇలియానాకు టాలీవుడ్ మేకర్స్ ఫిదా అవుతున్నారు. వరుసపెట్టి ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఓ క్రేజీ ఆఫర్ గోవా బ్యూటీ చెంతకు వచ్చింది. కానీ దానికి ఇల్లీ బేబీ నో చెప్పింది.

మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ”వినయ విధేయ రామ” అనే సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ మూవీలో ఓ ఐటెంసాంగ్ ఉంది. బోయపాటి సినిమాల్లో ఐటెంసాంగ్స్ అంటే ఎవరో ఒక హీరోయిన్ ఉండాల్సిందే. అందుకే ఆ పాట కోసం ఇలియానాను సంప్రదించారు. ఇలియానా కూడా ఐటెంసాంగ్ కు సై అంది. కాకపోతే 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అంటే 3 రోజుల కాల్షీట్లకు 60 లక్షలన్నమాట. ఇంకా చెప్పాలంటే, రోజుకు 20 లక్షలన్నమాట.

ఇలియానా చెప్పిన ఎమౌంట్ కు నిర్మాత డీవీవీ దానయ్యకు కళ్లు బైర్లు కమ్మాయి. తర్వాత ఫోన్ చేసి ఏం విషయం చెబుతానంటూ చల్లగా అక్కడ్నుంచి జారుకున్నాడట. ప్రస్తుతానికైతే ఈ మేటర్ ఇక్కడితో ఆగింది. చరణ్ లేదా బోయపాటి పట్టుపడితే 60 లక్షలు ఇచ్చి ఇలియానాను తేవాల్సిందే.

First Published:  25 Nov 2018 2:18 AM GMT
Next Story