Telugu Global
NEWS

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వెనుక అసలు గుట్టు...

2014 ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 15 అసెంబ్లీ స్థానాలను గెలిచిన టీడీపీ ఈసారి కేవలం 13 స్థానాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్‌తో జతకట్టడడం తొలుత అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 15 సీట్లు గెలిచిన టీడీపీ కనీసం 15 సీట్లలో కూడా పోటీ చేయలేని దుస్థితి ఎందుకొచ్చింది అని టీడీపీ నేతలే తలపట్టుకున్నారు. కనీసం ఓ 30 స్థానాలైనా కూటమిలో భాగంగా తీసుకుంటారని భావిస్తే చివరకు 13 సీట్లు… అవి కూడా కాంగ్రెస్ చెప్పిన ఒకే ఒక్క మాటకు […]

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వెనుక అసలు గుట్టు...
X

2014 ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 15 అసెంబ్లీ స్థానాలను గెలిచిన టీడీపీ ఈసారి కేవలం 13 స్థానాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్‌తో జతకట్టడడం తొలుత అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 15 సీట్లు గెలిచిన టీడీపీ కనీసం 15 సీట్లలో కూడా పోటీ చేయలేని దుస్థితి ఎందుకొచ్చింది అని టీడీపీ నేతలే తలపట్టుకున్నారు.

కనీసం ఓ 30 స్థానాలైనా కూటమిలో భాగంగా తీసుకుంటారని భావిస్తే చివరకు 13 సీట్లు… అవి కూడా కాంగ్రెస్ చెప్పిన ఒకే ఒక్క మాటకు చంద్రబాబు ఓకే చెప్పడం చూసి తమ్ముళ్లే కంగుతిన్నారు.

అయితే చంద్రబాబు జస్ట్‌ 13 సీట్లు అయినా మహాప్రసాదం అని తీసుకోవడం వెనుక లెక్క వేరే ఉందని టీటీడీపీ సీనియర్లు… చోటా నేతలకు వివరిస్తున్నారు. 2014లో 15 సీట్లలో టీడీపీ గెలిచినా ఆ తర్వాత పరిణామాలతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతినిపోయింది.

ఓటుకు నోటు దెబ్బతో టీడీపీపై ఒక విధమైన నెగిటివ్‌ ఫీలింగ్‌ చివరకు సెటిలర్స్‌లో సైతం వచ్చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కేడర్‌ మొత్తం అటు టీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పొత్తు పెట్టుకోకుండా బరిలో దిగితే ప్రిస్టేజ్‌ కోసమైనా 119 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.

అదే చేస్తే ఈసారి కనీసం 80 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా టీడీపీకి వచ్చే పరిస్థితి లేదని… ఆ విషయాన్ని చంద్రబాబు పసిగట్టే కాంగ్రెస్‌తో పొత్తుకు సై అన్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి 80 శాతం స్థానాల్లో డిపాజిట్లు పోతే… చంద్రబాబు ఏపీలోనే కాదు… పక్క రాష్ట్రాలకు వెళ్లి ఇతర పార్టీ నేతల వద్ద ముఖం కూడా చూపించుకునే పరిస్థితి ఉండేది కాదంటున్నారు.

అలా డిపాజిట్లు కోల్పోయే డిజాస్టర్‌ను మూటకట్టుకోకుండా ఉండేందుకే చంద్రబాబు తెలివిగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని చెబుతున్నారు. పొత్తు వల్ల ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో గెలవకపోయినా మరీ పరువు పోయే స్థాయిలో ఓటింగ్ ఉండదని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. సీనియర్లు చెప్పిన డిపాజిట్ల గండం గురించి విన్న తర్వాత చోటా నేతలు అమ్మ… బాబూ…. అంటున్నారు.

First Published:  23 Nov 2018 8:38 PM GMT
Next Story