Telugu Global
Cinema & Entertainment

పుకార్లు నమ్మొద్దు.... నేను సేఫ్

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్. కొన్ని రోజులుగా రాజశేఖర్ కి యాక్సిడెంట్ జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ అసలేం జరిగిందో తన మాటల్లో సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు. ఆక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే అయినా, అది జస్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన చిన్న ప్రమాదమేనని, తనతో పాటు ఈ షెడ్యూల్ లో చాలా మంది నటీనటులు పాల్గొంటున్న కారణంగా, కాల్షీట్ల సమస్య రాకూడదనే ఉద్దేశంతో రెస్ట్ కూడా […]

పుకార్లు నమ్మొద్దు.... నేను సేఫ్
X

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్. కొన్ని రోజులుగా రాజశేఖర్ కి యాక్సిడెంట్ జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ అసలేం జరిగిందో తన మాటల్లో సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు.

ఆక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే అయినా, అది జస్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన చిన్న ప్రమాదమేనని, తనతో పాటు ఈ షెడ్యూల్ లో చాలా మంది నటీనటులు పాల్గొంటున్న కారణంగా, కాల్షీట్ల సమస్య రాకూడదనే ఉద్దేశంతో రెస్ట్ కూడా తీసుకోకుండా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నామని క్లియర్ చేశాడు రాజశేఖర్. ఈ షెడ్యూల్ లో రిస్కీ స్టంట్స్ చేశాడు రాజశేఖర్.

ప్రస్తుతం కల్కి నెక్స్ట్ షెడ్యూల్ కోసం కులుమనాలి వెళ్లిన రాజశేఖర్, తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్థారించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోస్, గతంలో తనకు జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించినవని, దయచేసి ఆ పాత ఫొటోల్ని ఛానెల్స్ లో చూపించొద్దని రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్.

First Published:  23 Nov 2018 6:35 AM GMT
Next Story