Telugu Global
Cinema & Entertainment

క్లైమాక్స్ హై లైట్ గా రాబోతున్న "రోబో 2.0"

సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ ల వస్తున్న సినిమా “రోబో 2.0”. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమా అన్ని పనులు పూర్తీ చేసుకొని నవంబర్ 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ హై లైట్ గా ఉంటుందట, ఆ క్లైమాక్స్ చివరి ఇరవై నిమిషాలు అసలు ప్రేక్షకులు ఎవ్వరూ తమ […]

క్లైమాక్స్ హై లైట్ గా రాబోతున్న రోబో 2.0
X

సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ ల వస్తున్న సినిమా “రోబో 2.0”. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమా అన్ని పనులు పూర్తీ చేసుకొని నవంబర్ 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ హై లైట్ గా ఉంటుందట, ఆ క్లైమాక్స్ చివరి ఇరవై నిమిషాలు అసలు ప్రేక్షకులు ఎవ్వరూ తమ సీట్స్ లో కూర్చోరట. ఎందుకంటే క్లైమాక్స్ ని ఆ రేంజ్ లో డిజైన్ చేసాడు శంకర్.

“రోబో” క్లైమాక్స్ కూడా ఇప్పటికి ఎంతో మందికి గుర్తు ఉండి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే “రోబో” రిలీజ్ టైం లో కూడా క్లైమాక్స్ హై లైట్ గా నిలిచింది. ఈ పార్ట్ 2 లో అయితే అక్షయ్ కుమార్ కి రోబో చిట్టి కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని టాక్. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ “రోబో” సినిమా కథకి సీక్వెల్ గా తెరకెక్కింది.

First Published:  22 Nov 2018 10:19 AM GMT
Next Story