Telugu Global
NEWS

వైఎస్ బొమ్మ పెట్టుకుని.... ఓట్లు అడుగుతున్న టీడీపీ!

అవతల తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు చంద్రబాబును రకరకాలుగా ఎద్దేవా చేస్తున్నారు. అసలు బాబు పొత్తులకు ఒక హద్దంటూ లేదని…. ఎవ్వరితో పొత్తు పెట్టుకోవడానికి అయినా బాబు రెడీ అని.. కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నాడు. కాంగ్రెస్ తో చేతులు కలపడం ద్వారా తన అవకాశవాదాన్ని చంద్రబాబు నాయుడు పరిపూర్ణంగా చూపించేశాడని కేటీఆర్ అంటున్నాడు. పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబుకు మరెవరూ మిగల్లేదని… ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే మిగిలిందని కేటీఆర్ చమత్కరించాడు. ఆ చమత్కారం సంగతలా ఉంటే…. అవతల […]

వైఎస్ బొమ్మ పెట్టుకుని.... ఓట్లు అడుగుతున్న టీడీపీ!
X

అవతల తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు చంద్రబాబును రకరకాలుగా ఎద్దేవా చేస్తున్నారు. అసలు బాబు పొత్తులకు ఒక హద్దంటూ లేదని…. ఎవ్వరితో పొత్తు పెట్టుకోవడానికి అయినా బాబు రెడీ అని.. కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నాడు.

కాంగ్రెస్ తో చేతులు కలపడం ద్వారా తన అవకాశవాదాన్ని చంద్రబాబు నాయుడు పరిపూర్ణంగా చూపించేశాడని కేటీఆర్ అంటున్నాడు. పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబుకు మరెవరూ మిగల్లేదని… ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే మిగిలిందని కేటీఆర్ చమత్కరించాడు.

ఆ చమత్కారం సంగతలా ఉంటే…. అవతల తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు వైఎస్ బొమ్మతో ఓటు అడుగుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలువురు తెలుగుదేశం నేతలు వైఎస్ఆర్ బొమ్మను వాడేసుకుంటున్నారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో…. వారి జెండాల్లో వైఎస్ బొమ్మ ఉంటోంది.

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అయిన వైఎస్ ను కూడా తమ వాడే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. నిర్లజ్జగా వైఎస్ బొమ్మతో టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

ఆఖరికి వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుక్కోవాల్సిన స్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు వైఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటాడు. ఇప్పుడు అవకాశవాదం కొద్దీ అదే వైఎస్ బొమ్మను వాడుకుంటున్నారు. దటీజ్ చంద్రబాబు.

First Published:  19 Nov 2018 12:35 AM GMT
Next Story