Telugu Global
NEWS

మాజీ మంత్రి శంకర్రావు చివరకు ఇలా మిగిలాడు

శంకర్రావు. ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోమోగిన పేరు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌ ఆస్తులపై హైకోర్టుకు జస్ట్‌ ఒక సంతకం లేని లేఖ రాసి సంచలనం సృష్టించారు. శంకర్రావు లేఖతో జగన్‌పై సీబీఐ విచారణ జరిగింది. జగన్‌పై కేసు వేసిన సమయంలో శంకర్రావును ఒక వర్గం మీడియా హీరోగా చూపించింది. ఆయనను మించిన పోటుగాడు ఏపీలోనే లేరన్నట్టు పబ్లిసిటీ ఇచ్చింది. కానీ అవసరం తీరాక శంకర్రావు పరిస్థితి మరోలా తయారవుతూ వచ్చింది. ఎర్రచందనం అమ్ముకుంటున్నారని నాటి ముఖ్యమంత్రి […]

మాజీ మంత్రి శంకర్రావు చివరకు ఇలా మిగిలాడు
X

శంకర్రావు. ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోమోగిన పేరు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌ ఆస్తులపై హైకోర్టుకు జస్ట్‌ ఒక సంతకం లేని లేఖ రాసి సంచలనం సృష్టించారు. శంకర్రావు లేఖతో జగన్‌పై సీబీఐ విచారణ జరిగింది.

జగన్‌పై కేసు వేసిన సమయంలో శంకర్రావును ఒక వర్గం మీడియా హీరోగా చూపించింది. ఆయనను మించిన పోటుగాడు ఏపీలోనే లేరన్నట్టు పబ్లిసిటీ ఇచ్చింది. కానీ అవసరం తీరాక శంకర్రావు పరిస్థితి మరోలా తయారవుతూ వచ్చింది. ఎర్రచందనం అమ్ముకుంటున్నారని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పైనా హైకోర్టుకు లేఖ రాశారు శంకర్రావు. దాంతో ఆగ్రహించిన కిరణ్‌కుమార్‌ రెడ్డి…. శంకర్రావుపై కేసులను వెలికి తీశారు.

ఇంట్లోకి పోలీసులను పంపించి బయటకు ఈడ్చుకెళ్లి స్టేషన్‌లో పెట్టించారు. కానీ అప్పుడు మాత్రం శంకర్రావుకు మీడియా కానీ, నేతలుగానీ అండగా నిలవలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం కనుమరుగు అవుతూ వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్రావు పేరును కాంగ్రెస్‌ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.

ఆయన వారసులకు కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో శంకర్రావు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పంపించారు. విధేయతకు పార్టీలో స్థానం లేకుండా పోయిందని శంకర్రావు ఆరోపించారు.

కాంగ్రెస్‌కు ఒకప్పుడు మూలస్తంభాలైన చెన్నారెడ్డి, వెంకటస్వామి కుటుంబీలకు కూడా టికెట్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకే తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. నిజానికి శంకర్రావు షాద్‌ నగర్‌ కాంగ్రెస్‌ టికెట్ ఆశించారు. కానీ ఆయన్ను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.

శంకర్రావు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని సమాచారం. మొత్తం మీద జగన్‌పై కేసులేయడం ద్వారా కాంగ్రెస్‌ నుంచి వైఎస్ కుటుంబం వెళ్లిపోవాల్సిన పరిస్థితికి కారణమైన శంకర్రావు…. ఇప్పుడు తాను కూడా కాంగ్రెస్‌లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని పార్టీ కల్పించింది.

First Published:  17 Nov 2018 11:32 PM GMT
Next Story