Telugu Global
NEWS

ఉత్తమ్‌ భార్యపై బాబు మనిషి పోటీ

సుధీర్ఘ ప్రయోగం తర్వాత మహాకూటమి ఒక కొలిక్కి వచ్చినా… ఇప్పుడే అసలు సవాళ్లు చుట్టుముడుతున్నాయి. పలుచోట్ల టీడీపీ, కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలో దిగుతున్నారు. ఇంతలో హఠాత్తుగా నటుడు వేణుమాధవ్‌ నేనున్నానంటూ తెరపైకి వచ్చారు. నల్లగొండ జిల్లా కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్టు వేణుమాధవ్ ప్రకటించారు. చంద్రబాబు అంటే పడి చచ్చే, టీడీపీని తొలి నుంచీ అమితంగా ప్రేమించే వేణుమాధవ్‌ కోదాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. పొత్తు పెట్టుకుని తర్వాత తన […]

ఉత్తమ్‌ భార్యపై బాబు మనిషి పోటీ
X

సుధీర్ఘ ప్రయోగం తర్వాత మహాకూటమి ఒక కొలిక్కి వచ్చినా… ఇప్పుడే అసలు సవాళ్లు చుట్టుముడుతున్నాయి. పలుచోట్ల టీడీపీ, కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలో దిగుతున్నారు.

ఇంతలో హఠాత్తుగా నటుడు వేణుమాధవ్‌ నేనున్నానంటూ తెరపైకి వచ్చారు. నల్లగొండ జిల్లా కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్టు వేణుమాధవ్ ప్రకటించారు.

చంద్రబాబు అంటే పడి చచ్చే, టీడీపీని తొలి నుంచీ అమితంగా ప్రేమించే వేణుమాధవ్‌ కోదాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.

పొత్తు పెట్టుకుని తర్వాత తన వారిని రెబల్స్‌గా బరిలో దింపే అలవాటున్న చంద్రబాబు… ఈసారి కూడా అదే ప్రయోగాలు చేస్తున్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వంద, రెండు వందల ఓట్లు కూడా కీలకమే కాబట్టి … వేణుమాధవ్‌ బరిలో దిగకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ పైనే ఉంటుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

వేణుమాధవ్‌ది స్వస్థలం కోదాడ పట్టణమే. కోదాడ నియోజకవర్గంలో తాను పలు సేవా కార్యక్రమాలు చేశానని… కాబట్టి ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారన్న ధీమాను వేణుమాధవ్ వ్యక్తం చేశారు.

First Published:  15 Nov 2018 4:00 AM GMT
Next Story