Telugu Global
Cinema & Entertainment

ఇలియానా'ని తన సినిమాలో వద్దన్న యంగ్ హీరో

ఇప్పుడున్న హీరోలలో హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న హీరో గోపిచంద్. రీసెంట్ గా 25 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. తన 25వ సినిమా “పంతం”ఆశించిన విజయాన్ని తన ఖాతాలో వెయ్యలేకపోయింది.”లౌక్యం” తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేవీ గోపిచంద్ ఖాతాలో లేవు. అందుకనే ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ ని.తమిళ దర్శకుడు తిరు కి అవకాశం ఇచ్చాడు తన 26వ మూవీకి. తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి హీరోయిన్ తో పెద్ద […]

ఇలియానాని తన సినిమాలో వద్దన్న యంగ్ హీరో
X

ఇప్పుడున్న హీరోలలో హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న హీరో గోపిచంద్. రీసెంట్ గా 25 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. తన 25వ సినిమా “పంతం”ఆశించిన విజయాన్ని తన ఖాతాలో వెయ్యలేకపోయింది.”లౌక్యం” తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేవీ గోపిచంద్ ఖాతాలో లేవు. అందుకనే ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ ని.తమిళ దర్శకుడు తిరు కి అవకాశం ఇచ్చాడు తన 26వ మూవీకి.

తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి హీరోయిన్ తో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈసారి హీరోయిన్ ని గోపిచంద్ డిసైడ్ చేయనున్నారని సమాచారం. గోపిచంద్ ఇది వరకే స్టార్ హీరోయిన్స్ తో నటించాడు. ఇప్పుడు కూడా ఒక స్టార్ హీరోయిన్ కే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అనుష్క,తాప్సి,రకుల్ ప్రీత్ వంటి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన గోపి ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి. తాజాగా తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న ఇలియానాను తీసుకుందామని దర్శకుడు తిరు అన్న మాటకి, ఇలియానాకి నటన రాదు మన సినిమాకి ఒద్దు అని గోపిచంద్ అన్నాడట. రీసెంట్ గా ఇలియానా కి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ విజయలేమి లేకపోవడం కూడా ఒక కారణం. మరి తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఈ సుందరికి అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.అటు గోపీచంద్ కి కూడా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందో కూడా వేచి చూడాల్సిందే.

First Published:  14 Nov 2018 12:48 AM GMT
Next Story