Telugu Global
Cinema & Entertainment

కాజల్ కి కెమరామెన్ ముద్దు

హీరో హీరోయిన్ కి ముద్దు పెట్టడం కామన్ కానీ ఒక కెమరామెన్ హీరోయిన్ కి ముద్దు పెడితే అది ఇక సంచలన విషయం అవుతుంది.ముద్దు పెట్టిన మాట వాస్తవమే కానీ ఇక్కడ సంచలనం ఏమి అవ్వలేదు. ఇంతకీ ముద్దు ఎవరు ఎవరికి పెట్టారనే గా మీ క్వశ్చన్.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా కాజల్,మెహరీన్ హీరోయిన్ లు గా తెరకెక్కుతున్న చిత్రం “కవచం”.ఈ చిత్రం యొక్క టీజర్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఈ సందర్భంలో […]

కాజల్ కి కెమరామెన్ ముద్దు
X

హీరో హీరోయిన్ కి ముద్దు పెట్టడం కామన్ కానీ ఒక కెమరామెన్ హీరోయిన్ కి ముద్దు పెడితే అది ఇక సంచలన విషయం అవుతుంది.ముద్దు పెట్టిన మాట వాస్తవమే కానీ ఇక్కడ సంచలనం ఏమి అవ్వలేదు. ఇంతకీ ముద్దు ఎవరు ఎవరికి పెట్టారనే గా మీ క్వశ్చన్.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా కాజల్,మెహరీన్ హీరోయిన్ లు గా తెరకెక్కుతున్న చిత్రం “కవచం”.ఈ చిత్రం యొక్క టీజర్ ని రీసెంట్ గా విడుదల చేసారు.

ఈ సందర్భంలో కాజల్ మాట్లాడుతుండగా .. కెమెరామెన్ చోట కె నాయుడు కాజల్ ని హగ్ చేసుకొని ముద్దు పెట్టాడు .. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఇదే టాపిక్. కాజల్ కూడా ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఇది వరకే చోట కె నాయుడు ,కాజల్ కలిసి చాలా సినిమాలకే పని చేసారు. అందువల్లే కాజల్ కూడా ముద్దు పెట్టినందుకు సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదేమో.

అదే ఇంకో హీరోయిన్ అయ్యి ఉంటే తప్పకుండా సీరియస్ గా తీసుకునేదేమో అని అనుకుంటున్నారు. చోట కే నాయుడు కూడా హీరోయిన్స్ తో చాలా సరదాగా ఉంటాడని తెలిసిన విషయమే. కానీ ఇలా స్టేజి పైన ఒక స్టార్ హీరోయిన్ కి ముద్దు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చోట కె నాయుడు మా ఫామిలీ లో ఒకడు అని పొగడటం వల్ల చోట వెళ్లి ప్రేమతో ముద్దు పెట్టాడని అంటున్నారు. మాకు ఇవేం కొత్త కాదు అని కాజల్ అంటోంది. మేము కలిసి దాదాపు ఆరు సినిమాలకి పైనే పని చేసామని కాజల్ చెప్పడం విశేషం.

First Published:  12 Nov 2018 10:39 PM GMT
Next Story