Telugu Global
Cinema & Entertainment

రాస్కోండి.. సినిమా సూపర్ హిట్

తన సినిమాల గురించి పబ్లిక్ గా పెద్దగా మాట్లాడరు రజనీకాంత్. దీనికి భిన్నంగా 2.0 సినిమా కోసం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు సూపర్ స్టార్. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, పైగా ఈ సినిమా విజయం తనకు చాలా కీలకం కావడంతో రజనీకాంత్ ప్రచారానికి వచ్చారు. కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈరోజు జరిగిన 2.0 ట్రయిలర్ లాంఛ్ లో చురుగ్గా పాల్గొన్న రజనీ, […]

రాస్కోండి.. సినిమా సూపర్ హిట్
X

తన సినిమాల గురించి పబ్లిక్ గా పెద్దగా మాట్లాడరు రజనీకాంత్. దీనికి భిన్నంగా 2.0 సినిమా కోసం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు సూపర్ స్టార్. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, పైగా ఈ సినిమా విజయం తనకు చాలా కీలకం కావడంతో రజనీకాంత్ ప్రచారానికి వచ్చారు. కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈరోజు జరిగిన 2.0 ట్రయిలర్ లాంఛ్ లో చురుగ్గా పాల్గొన్న రజనీ, సినిమాపై చాలా పాజిటివ్ గా స్పందించారు. రాస్కోండి.. సినిమా సూపర్ హిట్ అంటూ ప్రకటించేశారు.

చెన్నైలో ఈ రోజు 2.0 ట్రయిలర్ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. సినిమా బడ్జెట్ కు తగ్గట్టే, ట్రయిలర్ లాంచ్ ను కూడా భారీగా చేశారు. రజనీకాంత్ తో పాటు 2.0లో విలన్ గా నటించిన అక్షయ్ కుమార్, దర్శకుడు శంకర్, హీరోయిన్ ఎమీ జాక్సన్, మ్యూజిక్ డైరక్టర్ రెహ్మాన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ ట్రయిలర్ లాంచ్ కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు రజనీకాంత్. సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పేశారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. ఆడియన్స్ ఏవైతే ఆశించారో అవే అంశాల్ని ట్రయిలర్ లో ఉంటారు. పూర్తిగా గ్రాఫిక్స్ తో ట్రయిలర్ ను నింపేశారు. చిట్టీ రీ-లోడెడ్ గా రజనీకాంత్, పక్షిరాజుగా అక్షయ్ కుమార్ బ్రహ్మాండంగా కుదిరారు. ట్రయిలర్ లో అణువణువునా భారీతనం, గ్రాఫిక్స్, ఖర్చు కనిపించాయి. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా, 12 భాషల్లో ఒకేసారి విడుదలకానుంది 2.0 సినిమా.

First Published:  3 Nov 2018 9:59 PM GMT
Next Story