Telugu Global
Cinema & Entertainment

అలాంటి పాత్రల్లో నటించను " హన్సిక

బాలనటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుంది హన్సిక. ప్రస్తుతం హన్సిక చేతిలో తెలుగు సినిమాలు ఏవి లేవు గాని తమిళ్ సినిమాలు మాత్రం బాగానే ఉన్నాయి. తెలుగులో గ్లామర్‌ నటిగా మంచి పేరు తెచ్చుకుంది హన్సిక. తమిళంలో స్టార్‌డమ్‌ సంపాదించింది. ప్రస్తుతం “మహా” సినిమాలో నటిస్తోంది. కాగా హన్సిక తన కెరీర్ కి సంభందించి ఒక సీరియస్‌ డెసిషన్‌ తీసుకుందట. ఇంతవరకూ గ్లామర్‌ డాళ్‌గా […]

అలాంటి పాత్రల్లో నటించను  హన్సిక
X

బాలనటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుంది హన్సిక. ప్రస్తుతం హన్సిక చేతిలో తెలుగు సినిమాలు ఏవి లేవు గాని తమిళ్ సినిమాలు మాత్రం బాగానే ఉన్నాయి. తెలుగులో గ్లామర్‌ నటిగా మంచి పేరు తెచ్చుకుంది హన్సిక. తమిళంలో స్టార్‌డమ్‌ సంపాదించింది. ప్రస్తుతం “మహా” సినిమాలో నటిస్తోంది.

కాగా హన్సిక తన కెరీర్ కి సంభందించి ఒక సీరియస్‌ డెసిషన్‌ తీసుకుందట. ఇంతవరకూ గ్లామర్‌ డాళ్‌గా నటించిన హన్సిక ఇకపై గ్లామర్‌కి టాటా బైబై చెప్పేస్తానంటోంది. అంటే హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లేనన్న మాట. అయితే హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ని డీల్‌ చేయగల సత్తా ఈ క్యూటీకి ఉందా లేదా అని మున్ముందు తెలుస్తుంది. ఇకపై పూర్తిగా గ్లామర్‌ పాత్రల్ని కాస్త తగ్గించి, పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందట ఈ బొద్దు గుమ్మ. మరి హన్సిక ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తుందో చూడాలి.

First Published:  3 Nov 2018 3:09 AM GMT
Next Story