Telugu Global
Cinema & Entertainment

కిమ్ శర్మ మాయలో మరొకరు

బాలీవుడ్ లో డేటింగ్ లు, పెళ్లి చేసుకొని విడిపోవడాలు ఇవన్నీ సర్వసాధారణం.టాలీవుడ్ లో “ఖడ్గం” చిత్రంలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ కుర్రకారు ని అందాలతో పిచ్చేక్కించిన భామ కిమ్ శర్మ. ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఆకట్టుకోలేదు. మళ్ళీ “మగధీర”సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ భామ మళ్ళీ సౌత్ వైపు చూడలేదు.కట్టుకున్న మొగుడ్ని వదిలేసి కోరుకున్న ప్రియుడితో ఉంటుంది  కిమ్ శర్మ . ఇక బాలీవుడ్ లో నటిగా కంటే […]

కిమ్ శర్మ మాయలో మరొకరు
X

బాలీవుడ్ లో డేటింగ్ లు, పెళ్లి చేసుకొని విడిపోవడాలు ఇవన్నీ సర్వసాధారణం.టాలీవుడ్ లో “ఖడ్గం” చిత్రంలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ కుర్రకారు ని అందాలతో పిచ్చేక్కించిన భామ కిమ్ శర్మ. ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఆకట్టుకోలేదు. మళ్ళీ “మగధీర”సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ భామ మళ్ళీ సౌత్ వైపు చూడలేదు.కట్టుకున్న మొగుడ్ని వదిలేసి కోరుకున్న ప్రియుడితో ఉంటుంది కిమ్ శర్మ .

ఇక బాలీవుడ్ లో నటిగా కంటే క్రికెటర్ యువరాజ్ సింగ్ తో చేసిన రొమాన్స్ వల్లే ఎక్కువగా పాపులర్ అయ్యింది కిమ్. యువరాజ్ తో ప్రేమాయణం అయిపోయాక అర్జున్ ఖన్నా తో డేటింగ్ చేసింది ఈ సుందరి. డేటింగ్ లో బ్రేక్ అప్ తరువాత అలీ ని పెళ్లి చేసుకుంది ఈ భామ. 2010 లో ఆరేళ్ళ కాపురం తర్వాత మొగుడితో వచ్చిన విబేధాల కారణంతో అతడ్ని కూడా వదిలేసింది . మొగుడ్ని వదిలేసిన తరువాత ఈ భామ తాజాగా ప్రియుడు హర్షవర్ధన్ రాణే తో ఎంజాయ్ చేస్తోంది . కుర్ర హీరోయిన్ లాగా బైక్ రైడింగ్ జాయింట్ గా చేస్తూ ఎంజాయ్ చేస్తుందట.తాజాగా హర్షవర్దన్ రాణే తో కలిసి బైక్ రైడింగ్ కెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . గతకొంత కాలంగా హర్షవర్దన్ రాణే తో ఈ భామ ఎఫైర్ సాగిస్తోందని రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి, కాగా వాటికీ మరింత ఊతమిచ్చేలా తాజా సంఘటన ఆ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చింది. హర్షవర్దన్ రాణే కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అంతే కాకుండా పలువురు భామలతో ఎఫైర్ కూడా నడిపాడు ఈ జూనియర్ జాన్ అబ్రహం.

First Published:  27 Oct 2018 8:37 AM GMT
Next Story