Telugu Global
Cinema & Entertainment

వెంకటేష్ కోసం మాస్ కథ

“గురు” సినిమా రిలీజ్ తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో కలిసి “ఎఫ్ 2” సినిమాలో నటిస్తున్న వెంకటేష్ మరో వైపు నాగ చైతన్యతో కలిసి “వెంకీ మామ” అనే సినిమా కోసం రెడీ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ ఉంది. ఇప్పుడు వెంకీ మరో డైరెక్టర్ కి కూడా ఛాన్స్ […]

వెంకటేష్ కోసం మాస్ కథ
X

“గురు” సినిమా రిలీజ్ తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో కలిసి “ఎఫ్ 2” సినిమాలో నటిస్తున్న వెంకటేష్ మరో వైపు నాగ చైతన్యతో కలిసి “వెంకీ మామ” అనే సినిమా కోసం రెడీ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ ఉంది. ఇప్పుడు వెంకీ మరో డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇచ్చాడు అని తెలుస్తుంది.

ఆ దర్శకుడు ఎవరో కాదు “నేను లోకల్” “హలో గురు ప్రేమకోసమే” వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న త్రినాధరావు నక్కిన తో వెంకటేష్ సినిమా ఉంటుందట. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు టాక్. త్రినాద్ రావు నక్కిన తన కోసం రాసుకున్న మాస్ లైన్ నచ్చి వెంకీ ఈ కథని ఓకే చేసినట్టు తెలుస్తుంది. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ పై భరత్ చౌదరి ఇంకా కిరణ్ రెడ్డి లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చాడు. మరి ఈ సినిమా పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

First Published:  25 Oct 2018 1:54 AM GMT
Next Story