Telugu Global
Cinema & Entertainment

ట్రయిలర్ కట్ అయింది.. పండగ మిగిలింది

ఏడాదిన్నరగా నలుగుతున్న రోబో సీక్వెల్ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ రెడీ అయింది. దీపావళి కానుకగా ట్రయిలర్ రాబోతోందంటూ ఇప్పటికే ప్రకటించిన యూనిట్, ఇప్పుడా తేదీని తెలిపింది. నవంబర్ 3న 2.0 ట్రయిలర్ రాబోతోంది. ఇది కేవలం ట్రయిలర్ మాత్రమే కాదు, ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇందులో. 4కే క్లారిటీతో, 4డీ డాల్బీ సిస్టమ్ తో వస్తోంది ఈ ట్రయిలర్. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ సినిమా ట్రయిలర్ కోసం ఈ టెక్నాలజీని వాడలేదు. అంతేకాదు, […]

ట్రయిలర్ కట్ అయింది.. పండగ మిగిలింది
X

ఏడాదిన్నరగా నలుగుతున్న రోబో సీక్వెల్ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ రెడీ అయింది. దీపావళి కానుకగా ట్రయిలర్ రాబోతోందంటూ ఇప్పటికే ప్రకటించిన యూనిట్, ఇప్పుడా తేదీని తెలిపింది. నవంబర్ 3న 2.0 ట్రయిలర్ రాబోతోంది.

ఇది కేవలం ట్రయిలర్ మాత్రమే కాదు, ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇందులో. 4కే క్లారిటీతో, 4డీ డాల్బీ సిస్టమ్ తో వస్తోంది ఈ ట్రయిలర్. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ సినిమా ట్రయిలర్ కోసం ఈ టెక్నాలజీని వాడలేదు. అంతేకాదు, ఇదే ట్రయిలర్ త్రీడీ వెర్షన్ లో కూడా రెడీ అవుతోంది. 4డీ సౌండ్ లో 4కె క్లారిటీతో ట్రయిలర్ అంటే.. 70ఎంఎం స్క్రీన్ పై ఈ ట్రయిలర్ చూస్తే రెండు కళ్లు చాలవన్నమాట.

మరోవైపు ఈ సినిమాతో తనకున్న ఓ ప్రత్యేకమైన అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. తన కెరీర్ లో ఎక్కువ రోజులు పనిచేసిన సినిమాగా 2.0 పేరును చెప్పుకొచ్చాడు. కెరీర్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ మ్యూజిక్ డైరక్టర్.. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా కోసం కూడా ఇన్ని రోజులు కేటాయించలేదని అంటున్నాడు. శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 29న థియేటర్లలోకి రానుంది.

First Published:  25 Oct 2018 6:19 AM GMT
Next Story