Telugu Global
Cinema & Entertainment

కనీసం వెబ్ లో నైనా హిట్ చేయండి

మంచు లక్ష్మి రీసెంట్ గా నటించిన సినిమా గుర్తుందా.. ఇలా ఎందుకు అడిగామంటే.. ఆమె సినిమాలు చేస్తూనే ఉంటుంది. అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. జనాలకు పెద్దగా గుర్తు కూడా ఉండదు. ఇక ఆమె రీసెంట్ మూవీ విషయానికొస్తే… తాజాగా వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాలో నటించింది మంచు లక్ష్మి. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కొన్ని రోజులకే ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. ఇప్పుడీ సినిమాకు మరోసారి ప్రచారం స్టార్ట్ చేసింది మంచు […]

కనీసం వెబ్ లో నైనా హిట్ చేయండి
X

మంచు లక్ష్మి రీసెంట్ గా నటించిన సినిమా గుర్తుందా.. ఇలా ఎందుకు అడిగామంటే.. ఆమె సినిమాలు చేస్తూనే ఉంటుంది. అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. జనాలకు పెద్దగా గుర్తు కూడా ఉండదు. ఇక ఆమె రీసెంట్ మూవీ విషయానికొస్తే… తాజాగా వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాలో నటించింది మంచు లక్ష్మి.

ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కొన్ని రోజులకే ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. ఇప్పుడీ సినిమాకు మరోసారి ప్రచారం స్టార్ట్ చేసింది మంచు లక్ష్మి. మీరు చదివింది నిజమే. ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చి, ఫ్లాప్ అయిన సినిమాకు లక్ష్మి మళ్లీ ప్రచారం స్టార్ట్ చేశారు. ఈసారి నెట్ ఫ్లిక్స్ కోసం

అవును.. వైఫ్ ఆఫ్ రామ్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో పెట్టబోతున్నారు. ఎల్లుండి నుంచి ఈ సినిమా ఇంటర్నెట్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ, మరోసారి ప్రచారం చేసి పెడుతోంది లక్ష్మి. ఈ సినిమాలో దీక్ష అనే వీరవనితగా నటించింది మంచు లక్ష్మి. తప్పుచేసిన సొంత భర్తనే కడతేర్చి, ఆ హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తుంది

First Published:  24 Oct 2018 10:38 PM GMT
Next Story