Telugu Global
NEWS

మంత్రి అఖిలప్రియ.... మరో మామతోనూ గొడవేసుకుంది!

భూమా నాగిరెడ్డి బతికున్న రోజుల్లో ఏవీ సుబ్బారెడ్డిని భూమా పిల్లలు అంతా మామగా సంబోధించే వాళ్లు. భూమాతో ఏవీకి ఉన్న సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో వీరు అంతా అలా హ్యాపీగా ఉండే వారు. అయితే భూమా నాగిరెడ్డి మరణించాక వీరి కథ మారిపోయింది. ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియకు అస్సలు పడకుండా అయ్యింది. వీరి కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకవర్గం మరో వర్గం ఎదురుపడితే కొట్టుకునేలా ఉంది పరిస్థితి. ఆ స్థాయిలో గొడవలు సాగుతూ ఉన్నాయి. ఆ […]

మంత్రి అఖిలప్రియ.... మరో మామతోనూ గొడవేసుకుంది!
X

భూమా నాగిరెడ్డి బతికున్న రోజుల్లో ఏవీ సుబ్బారెడ్డిని భూమా పిల్లలు అంతా మామగా సంబోధించే వాళ్లు. భూమాతో ఏవీకి ఉన్న సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో వీరు అంతా అలా హ్యాపీగా ఉండే వారు. అయితే భూమా నాగిరెడ్డి మరణించాక వీరి కథ మారిపోయింది. ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియకు అస్సలు పడకుండా అయ్యింది. వీరి కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి.

ఒకవర్గం మరో వర్గం ఎదురుపడితే కొట్టుకునేలా ఉంది పరిస్థితి. ఆ స్థాయిలో గొడవలు సాగుతూ ఉన్నాయి.

ఆ గొడవలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా సాగుతున్నాయి. ఆళ్లగడ్డ నుంచి తను పోటీ చేస్తానని సుబ్బారెడ్డి అంటున్నాడు. ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పంచాయితీలు చేస్తూ ఉన్నాడు.

అఖిలప్రియను ఆళ్లగడ్డ నుంచి తప్పించాలని కూడా బాబు అనుకుంటున్నాడట. ఆమెను నంద్యాల ఎంపీగా బరిలోకి దిగమని అడుగుతున్నాడట. దానికి అఖిల నో అంటోందని సమాచారం.

ఆ సంగతలా ఉంటే…. ఇప్పుడు అఖిలప్రియ తన జిల్లాకే చెందిన మరో నేతతో గొడవకు దిగుతోందని సమాచారం.

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో అఖిలప్రియ ఢీ అంటోందని సమాచారం. విశేషం ఏమిటంటే.. బుడ్డాను కూడా మామ వరసతోనే పిలిచేది అఖిలప్రియ. బుడ్డా కూడా ఆమెను కోడలా అని పిలిచేవాడట. అయితే వీరిద్దరి మధ్యన ఇప్పుడు రచ్చ రాజుకుంది.

ఇది ఎర్రమట్టి విషయంలో. ఇటుక బట్టీలకు ఎర్రమట్టిని అమ్మడం విషయంలో వీరిద్దరి మధ్యన వైరుధ్యాలు పొడసూపాయని సమాచారం.

తన నియోజకవర్గం పరిధిలో అఖిలప్రియ మనుషులు ఎర్రమట్టి తవ్వుతున్నారని…. అక్కడ తనకే హక్కులుంటాయని అంటున్నాడట బుడ్డా. అయితే తాము భూమిని కొని అక్కడ తవ్వుతున్నామని అఖిలప్రియ వర్గం అంటోందట. ఏదేమైనా తన నియోజకవర్గం పరిధిలో అఖిల జోక్యాన్ని సహించేది లేదని అంటున్నాడట బుడ్డా. దీంతో ఈ ఫిరాయింపు నేతలిద్దరి మధ్యన రచ్చ రాజుకుందని సమాచారం.

First Published:  25 Oct 2018 5:20 AM GMT
Next Story