Telugu Global
NEWS

టీడీపీ మేయర్‌ ఇంటిపై ఐటీ దాడులు....

మరో నేతపై ఐటీ విరుచుకుపడింది. విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ఇంటిపై ఐటీ అధికారులు మెరుగుదాడులు చేశారు. మూడు గంటల పాటు ఇల్లు, ఆఫీస్‌లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల విషయం బయటకు పొక్కకుండా బైకులపై వచ్చిన ఐటీ అధికారులు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. దాడులు జరుగుతున్న విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కేఎంకే ఈవెంట్స్ సంస్థలో కోనేరు శ్రీధర్‌ భార్య డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ […]

టీడీపీ మేయర్‌ ఇంటిపై ఐటీ దాడులు....
X

మరో నేతపై ఐటీ విరుచుకుపడింది. విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ఇంటిపై ఐటీ అధికారులు మెరుగుదాడులు చేశారు. మూడు గంటల పాటు ఇల్లు, ఆఫీస్‌లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

దాడుల విషయం బయటకు పొక్కకుండా బైకులపై వచ్చిన ఐటీ అధికారులు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. దాడులు జరుగుతున్న విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కేఎంకే ఈవెంట్స్ సంస్థలో కోనేరు శ్రీధర్‌ భార్య డైరెక్టర్‌గా ఉన్నారు.

ఈ సంస్థ కృష్ణాపుష్కరాల సమయంలో పనులకు సంబంధించి భారీగా కాంట్రాక్టులు దక్కించుకుంది. కోట్లాది రూపాయలు వస్తున్నా వాటిని మాత్రం బయటకు చూపకుండా పన్నులు ఎగ్గొడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ.

మేయర్ కోనేరు శ్రీధర్‌ అవినీతి వ్యవహారాలు హద్దు మీరాయని టీడీపీ కార్పొరేటర్లు కూడా పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరిగాయి. లెక్కల్లో పలు అక్రమాలు ఉన్నట్టు ఐటీ గుర్తించినట్టు సమాచారం.

First Published:  23 Oct 2018 11:55 PM GMT
Next Story