Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" బయోపిక్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. ఈ సినిమాలో దాదాపు అందరూ పెద్ద పెద్ద నటులు నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో నటిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి సెట్ అయ్యే పాత్ర ఒక్కటి కూడా […]

ఎన్టీఆర్ బయోపిక్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
X

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. ఈ సినిమాలో దాదాపు అందరూ పెద్ద పెద్ద నటులు నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో నటిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి సెట్ అయ్యే పాత్ర ఒక్కటి కూడా లేదంట. అందుకే సినిమా మొదట్లో ఒక గంబీరమైన వాయిస్ ఓవర్ ని జూనియర్ ఎన్టీఆర్ చేత చెప్పించాలి అనేది దర్శకుడు క్రిష్ ప్లాన్ అంట. ఈ మేరకు క్రిష్ రచయిత సాయి మాధవ్ బుర్ర తో కలిసి వాయిస్ ఓవర్ కూడా రాయిస్తున్నాడు అని తెలిసింది.

ఎటువంటి పాత్ర లేనప్పుడు కథని ముందుకి నడిపించే వాయిస్ ఓవర్ అయితేనే ఎన్టీఆర్ కి బాగుంటుంది అని బాలకృష్ణ కూడా భావించాడట. ఇదిలా ఉంటే ఇటివలే జరిగిన “అరవింద సమేత” సక్సెస్ మీట్ కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.

First Published:  23 Oct 2018 4:35 AM GMT
Next Story