Telugu Global
NEWS

ఆర్.కృష్ణయ్య బ్యాక్ గ్రౌండ్ తెలిసి కాంగ్రెసోళ్ల పరేషాన్..

ఆర్. కృష్ణయ్య.. బీసీ నేతగా పాపులర్ అయిన నేత.. విద్యార్థులు, విద్యావ్యవస్థ మెరుగు కోసం ఎంతగానో పోరాడారు. అలానే ఎదిగారు. ఆ తర్వాత గడిచిన 2014 ఎన్నికల్లో కుదేలైన టీడీపీ ఈయన్ను టీడీపీ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి ఎన్నికల్లోకి దిగింది. కానీ ప్చ్.. ఫలితం రాలేదు. గెలిచాక టీడీపీ ఈయన్ను వదిలేసింది. ఈయన టీడీపీని వదిలేశాడు.. ఎర్రబెల్లిని టీడీపీ శాసనసభాపక్ష నేతగా ప్రకటించి ఆర్.కృష్ణయ్యకు టీడీపీ మొండి చేయి చూపింది. దాంతో టీడీపీ నుంచి గెలిచినా […]

ఆర్.కృష్ణయ్య బ్యాక్ గ్రౌండ్ తెలిసి కాంగ్రెసోళ్ల పరేషాన్..
X

ఆర్. కృష్ణయ్య.. బీసీ నేతగా పాపులర్ అయిన నేత.. విద్యార్థులు, విద్యావ్యవస్థ మెరుగు కోసం ఎంతగానో పోరాడారు. అలానే ఎదిగారు. ఆ తర్వాత గడిచిన 2014 ఎన్నికల్లో కుదేలైన టీడీపీ ఈయన్ను టీడీపీ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి ఎన్నికల్లోకి దిగింది. కానీ ప్చ్.. ఫలితం రాలేదు. గెలిచాక టీడీపీ ఈయన్ను వదిలేసింది. ఈయన టీడీపీని వదిలేశాడు.. ఎర్రబెల్లిని టీడీపీ శాసనసభాపక్ష నేతగా ప్రకటించి ఆర్.కృష్ణయ్యకు టీడీపీ మొండి చేయి చూపింది. దాంతో టీడీపీ నుంచి గెలిచినా ఆయన ఎన్నడూ ఆపార్టీ నేతలతో కలవలేదు.. కూర్చోలేదు. పోరాడలేదు. ఇప్పుడాయన చూపు కాంగ్రెస్ పై పడింది.

ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్త తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. కానీ ఈయన రాకను మాత్రం కాంగ్రెస్ నేతలు ఇష్టపడడం లేదట.. గెలిచేదాక బాగుండి.. పార్టీ బలంతో గెలిచి.. అనంతరం సొంత ఎజెండాతో ముందుకెళ్లడం ఆర్.కృష్ణయ్య అలవాటని పాత సంఘటనలను నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బలంతో గెలిచినా ఆయన చివరి వరకూ కాంగ్రెస్ తో సాగరని.. పార్టీని వాడుకొని వదిలేస్తాడని వారు లోలోపల పరేషాన్ అవుతున్నారట..

నిజానికి ఆర్.కృష్ణయ్య లాంటి బలమైన నేత వస్తానంటే ఎగిరిగంతేసి కళ్లకు అద్దుకోవాలి. కానీ ఆయన గడిచిన 5 ఏళ్లుగా పాలిటిక్స్ లో వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఈయన వస్తానన్నా పార్టీలు స్వాగతించని పరిస్థితి. పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా ఆయన పోరాడడమే ఇక్కడ పార్టీలకు సమస్యగా మారింది. అందుకే అందరూ వద్దంటున్న ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరితే ఆయనకు ప్రాధాన్యం ఉంటుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..

First Published:  20 Oct 2018 1:16 AM GMT
Next Story