Telugu Global
Cinema & Entertainment

సుకుమార్ నిర్మాతగా నాగ శౌర్య సినిమా

స్టార్ డైరెక్టర్ సుకుమార్ “రంగస్థలం” లాంటి హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా పనులతో పాటు సుకుమార్ ఒక లవ్ స్టొరీ రాసే పనిలో బిజీగా ఉన్నాడు అని తెలుస్తుంది.  అయితే ఈ కథ మహేష్ బాబు కోసం కాదు. సుకుమార్ కథ అందించి నిర్మించిన సినిమా “కుమారి 21f” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. […]

సుకుమార్ నిర్మాతగా నాగ శౌర్య సినిమా
X

స్టార్ డైరెక్టర్ సుకుమార్ “రంగస్థలం” లాంటి హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా పనులతో పాటు సుకుమార్ ఒక లవ్ స్టొరీ రాసే పనిలో బిజీగా ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ కథ మహేష్ బాబు కోసం కాదు. సుకుమార్ కథ అందించి నిర్మించిన సినిమా “కుమారి 21f” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అయన కథ అందించిన “దర్శకుడు” సినిమా పెద్దగా ఆడలేదు.

ఈ ఫ్లాప్ తరువాత ఇప్పుడు సుకుమార్ నుంచి నిర్మాతగా మూడో సినిమా రాబోతుంది. ఓ ప్రేమకథా చిత్రాన్ని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించడానికి సుకుమార్ ట్రై చేస్తున్నాడట. నాగశౌర్య, రష్మిక జంటగా ఈ లవ్ స్టొరీ తెరకేక్కనుందట. సుకుమార్ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన ఓ కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అతి త్వరలో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తాడు సుకుమార్. ఇదిలా ఉంటే సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  13 Oct 2018 12:33 AM GMT
Next Story