Telugu Global
Cinema & Entertainment

అనుపమ పరమేశ్వరన్ ఆశలు అన్నీ ఆ దర్శకుడి పైనే

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది. క్రేజ్ అయితే ఉంది గాని ఆమె నటించిన సినిమాలు అన్నీ ఆవరేజ్ గా మాత్రమే నిలిచాయి. ఇటివలే కాలంలో అనుపమ కి ఫ్లాప్స్ వచ్చాయి. సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఆమె పెర్ఫార్మెన్స్ బాగా నచ్చడంతో రామ్ తన తదుపరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అనుపమ, రామ్ జంటగా “హలో గురు ప్రేమకోసమే” సినిమాలో నటిస్తున్నారు. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. […]

అనుపమ పరమేశ్వరన్ ఆశలు అన్నీ ఆ దర్శకుడి పైనే
X

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది. క్రేజ్ అయితే ఉంది గాని ఆమె నటించిన సినిమాలు అన్నీ ఆవరేజ్ గా మాత్రమే నిలిచాయి. ఇటివలే కాలంలో అనుపమ కి ఫ్లాప్స్ వచ్చాయి. సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఆమె పెర్ఫార్మెన్స్ బాగా నచ్చడంతో రామ్ తన తదుపరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు.

ప్రస్తుతం అనుపమ, రామ్ జంటగా “హలో గురు ప్రేమకోసమే” సినిమాలో నటిస్తున్నారు. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ఎక్కడా అనుకున్నంత బజ్ లేదు.తాజాగా విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ యావరేజ్ గా ఉండడంతో ప్రేక్షకులు దీనిపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. దానికి తోడూ దిల్ రాజు, రామ్, అనుపమ కొన్ని సినిమాల నుంచి ఫాం లో లేరు. అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన మాత్రం ఊపు మీద వున్నాడు. “సినిమా చూపిస్త మామ” “నేను లోకల్” అనే సినిమాలతో హిట్ కొట్టాడు.

ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఆశలన్నీ ఈ డైరెక్టర్ మీదే ఉన్నాయి. ఈ డైరెక్టర్ తో అయిన ఒక మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలి అనేది అనుపమ పరమేశ్వరన్ ప్లాన్. మరి అనుపమ ఆశలు నేరవేరతాయో లేదో చూడాలి.

First Published:  9 Oct 2018 2:39 AM GMT
Next Story