Telugu Global
Cinema & Entertainment

మరోసారి మహేష్ బాబు సరసన ఇలియానా

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “పోకిరి”. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అయితే మళ్ళి ఇన్నాళ్ళకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానా ను ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ఆ విషయం ఎంత వరకు […]

మరోసారి మహేష్ బాబు సరసన ఇలియానా
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “పోకిరి”. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అయితే మళ్ళి ఇన్నాళ్ళకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానా ను ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ఆ విషయం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ, ఈ వార్త మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇలియానా శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న ఇలియానా, తన రేంజ్ ఆఫర్స్ వస్తే ఇక్కడ తెలుగులో కూడా నటించడానికి రెడీగానే ఉంది.

First Published:  6 Oct 2018 3:48 AM GMT
Next Story