Telugu Global
National

పక్క రాష్ట్రాల నుంచి మహిళా పోలీసులను రప్పిస్తాం " కేరళ సీఎం

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం స్వాగతించింది. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన కూడా తమకు లేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. శబరిమల ఆలయ సందర్శనకు మహిళలు వస్తే వారికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. పక్క రాష్ట్రాల సాయం కూడా తీసుకుని ఆలయం వద్ద మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. ఇకపై […]

పక్క రాష్ట్రాల నుంచి మహిళా పోలీసులను రప్పిస్తాం  కేరళ సీఎం
X

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం స్వాగతించింది. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన కూడా తమకు లేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. శబరిమల ఆలయ సందర్శనకు మహిళలు వస్తే వారికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు.

ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. పక్క రాష్ట్రాల సాయం కూడా తీసుకుని ఆలయం వద్ద మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. ఇకపై శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలను ఎవరూ అడ్డుకోలేరని విజయన్ వ్యాఖ్యానించారు.

సుప్రీం తీర్పుపై ఆలయ కమిటీ ఇప్పటికీ ఆగ్రహంగానే ఉంది. నిజమైన అయ్యప్ప స్వామి మహిళా భక్తులు ఎవరూ ఇక్కడికి రారని… కేవలం మహిళా సంఘాల కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వస్తారని ట్రావెన్‌ కోర్ ఆలయ బోర్డు చైర్మన్ పద్మాకుమార్‌ వ్యాఖ్యానించారు.

First Published:  3 Oct 2018 6:06 AM GMT
Next Story