Telugu Global
Cinema & Entertainment

విలన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు తమిళ్ లో అటు స్టార్ హీరోస్ తో పాటు కుర్రహీరోలతో కూడా నటిస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తుంది. ఎప్పటిలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో కాజల్ కి ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు కాబట్టే ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన నటిస్తుందని కాజల్. తేజ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే కాజల్ తో శ్రీనివాస్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో సినిమా టీజరో, ట్రైలరో విడుదల అయితేనే తెలుస్తుంది. అయితే ఈ […]

విలన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్
X

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు తమిళ్ లో అటు స్టార్ హీరోస్ తో పాటు కుర్రహీరోలతో కూడా నటిస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తుంది. ఎప్పటిలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో కాజల్ కి ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు కాబట్టే ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన నటిస్తుందని కాజల్. తేజ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే కాజల్ తో శ్రీనివాస్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో సినిమా టీజరో, ట్రైలరో విడుదల అయితేనే తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కాదు విలన్ గా నటిస్తుందట.ఈ సినిమాలో ఓ బిజినెస్ విమెన్ గా కాజల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అనే వార్త పరిశ్రమలో వినిపిస్తుంది. కాజల్ తన పాత్ర ద్వారా విలనిజాన్ని పండించబోతుందని, బెల్లంకొండ శ్రీనివాస్ తో నువ్వా నేనా అన్నట్టుగా కాజల్ ఈ సినిమాలో తల పడనుంది అని తెలుస్తుంది.

బాలీవుడ్ నటుడు అయిన నీల్ నితిన్ ముఖేష్ మరో విలన్ గా నటిస్తున్నాడు ఈ సినిమాలో. మరి ఇప్పటి వరకు కెరీర్ లో విభిన్నమైన పాత్రల్లో నటించని కాజల్ ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

First Published:  2 Oct 2018 1:37 AM GMT
Next Story