Telugu Global
Cinema & Entertainment

క్రిష్ కు మరో సావిత్రి దొరికేసింది

మహానటి సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులు ఎవర్నీ ఎన్టీఆర్ బయోపిక్ లో రిపీట్ చేయకూడదని తనకుతానుగా నియమం పెట్టుకున్నాడు దర్శకుడు క్రిష్. ఇందులో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యను కాకుండా సుమంత్ ను తీసుకున్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో రీప్లేస్ మెంట్ కూడా జరిగింది. అదే సావిత్రి పాత్ర. మొన్నటివరకు సావిత్రి అంటే కీర్తిసురేష్. కీర్తిసురేష్ అంటే సావిత్రి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్ర కోసం ఆమెను తీసుకోవడం లేదు. […]

క్రిష్ కు మరో సావిత్రి దొరికేసింది
X

మహానటి సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులు ఎవర్నీ ఎన్టీఆర్ బయోపిక్ లో రిపీట్ చేయకూడదని తనకుతానుగా నియమం పెట్టుకున్నాడు దర్శకుడు క్రిష్. ఇందులో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యను కాకుండా సుమంత్ ను తీసుకున్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో రీప్లేస్ మెంట్ కూడా జరిగింది. అదే సావిత్రి పాత్ర.

మొన్నటివరకు సావిత్రి అంటే కీర్తిసురేష్. కీర్తిసురేష్ అంటే సావిత్రి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్ర కోసం ఆమెను తీసుకోవడం లేదు. ఆ పాత్ర కోసం నిత్యామీనన్ ను సంప్రదించారు. క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉంటే వెంటనే ఒప్పుకోవడం నిత్యా స్టయిల్. అందుకే సావిత్రి పాత్ర పోషించేందుకు ఆమె ఒప్పుకుందట.

మరోవైపు ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ అంశంపై కూడా క్లారిటీ ఇవ్వనుంది యూనిట్. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ, చంద్రబాబు పాత్రను రానా, బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

First Published:  22 Sep 2018 11:19 AM GMT
Next Story