Telugu Global
Cinema & Entertainment

అంటే వీళ్ళు పెళ్ళే చేసుకోరా ?

నయనతార, విజ్ఞేశ్ శివన్ ఇప్పుడు ఎక్కడ చూసిన వీరిద్దరూ గురించే టాపిక్ నడుస్తుంది. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరూ దాదాపు రెండేళ్ల నుండి సహజీవనం చేస్తున్నారు. ఫారిన్ టూర్ లకు వెళ్లినా, ఫంక్షన్ లకు వెళ్లినా జంటగా వెళ్తున్నారు ఫోటోలకు ఫోజిస్తున్నారు. కానీ వీళ్ళ ప్రేమ గురించి అడిగితే మాత్రం అస్సలు సమాధానం చెప్పట్లేదు. ఇకపోతే ఇటివలే విజ్ఞేశ్ శివన్ ని పెళ్లి గురించి అడిగితే అస్సలు మాట్లాడటం లేదు. నయనతారతో ప్రేమలో ఉన్నారా పెళ్లి ఎప్పుడు […]

అంటే వీళ్ళు పెళ్ళే చేసుకోరా ?
X

నయనతార, విజ్ఞేశ్ శివన్ ఇప్పుడు ఎక్కడ చూసిన వీరిద్దరూ గురించే టాపిక్ నడుస్తుంది. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరూ దాదాపు రెండేళ్ల నుండి సహజీవనం చేస్తున్నారు. ఫారిన్ టూర్ లకు వెళ్లినా, ఫంక్షన్ లకు వెళ్లినా జంటగా వెళ్తున్నారు ఫోటోలకు ఫోజిస్తున్నారు. కానీ వీళ్ళ ప్రేమ గురించి అడిగితే మాత్రం అస్సలు సమాధానం చెప్పట్లేదు.

ఇకపోతే ఇటివలే విజ్ఞేశ్ శివన్ ని పెళ్లి గురించి అడిగితే అస్సలు మాట్లాడటం లేదు. నయనతారతో ప్రేమలో ఉన్నారా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే, దానికి నాదగ్గర సమాధానం లేదు ఎందుకంటే నయనతార సమాధానం చెప్పాలి అలాగే మా అమ్మగారు అనుమతి ఇవ్వాలి అప్పుడే ఏదైనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. విజ్ఞేశ్ శివన్ మాటలు చూస్తుంటే వీళ్ళిద్దరూ ఎప్పటికి ఇలాగే సహజీవనం చేసేలాగా ఉన్నారని కోలివుడ్ కోడై కూస్తుంది. మరి నయనతార విజ్ఞేశ్ శివన్ అన్న మాటలకి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే నయనతార ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతుంది.

First Published:  19 Sep 2018 11:42 PM GMT
Next Story