Telugu Global
NEWS

టీవీ9 పయనం ఎటు?

టీవీ9 న్యూస్‌ చానల్స్‌ అమ్మకం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. టీవీ9 గ్రూపును సొంతం చేసుకునేందుకు ఈసారి జీ గ్రూప్‌ రంగంలోకి దిగింది. 850 కోట్లకు టీవీ9 గ్రూపు చానల్స్‌ను సొంతం చేసుకుందుకు డీల్ నడుస్తున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం టీవీ9 గ్రూపులో తెలుగుతో పాటు ఏడు భాషల్లో న్యూస్‌ చానెళ్లు ఉన్నాయి. టీవీ9 ప్రమోటర్‌ శ్రీనిరాజుకు ప్రస్తుతం 60 శాతం వాటా ఉంది. రవిప్రకాశ్‌కు 20 శాతం వాటా ఉంది. జీ టీవీతో […]

టీవీ9 పయనం ఎటు?
X

టీవీ9 న్యూస్‌ చానల్స్‌ అమ్మకం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. టీవీ9 గ్రూపును సొంతం చేసుకునేందుకు ఈసారి జీ గ్రూప్‌ రంగంలోకి దిగింది. 850 కోట్లకు టీవీ9 గ్రూపు చానల్స్‌ను సొంతం చేసుకుందుకు డీల్ నడుస్తున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం టీవీ9 గ్రూపులో తెలుగుతో పాటు ఏడు భాషల్లో న్యూస్‌ చానెళ్లు ఉన్నాయి. టీవీ9 ప్రమోటర్‌ శ్రీనిరాజుకు ప్రస్తుతం 60 శాతం వాటా ఉంది. రవిప్రకాశ్‌కు 20 శాతం వాటా ఉంది. జీ టీవీతో చర్చలను టీవీ 9 గ్రూపు ప్రతినిధులు కూడా ధృవీకరిస్తున్నారు. అయితే డీల్‌ ఇంకా సెట్‌ కాలేదని చెబుతున్నారు. జీ గ్రూప్ ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్‌ విభాగాల్లో కలిపి మొత్తం 35 చానళ్లను నడుపుతోంది. టీవీ9 చానల్స్‌ కొనుగోలుకు కొద్దిరోజుల క్రితం ఒకప్రముఖ మీడియా గ్రూప్ ముందుకొచ్చింది. అయితే ఆ డీల్‌ కూడా కుదరలేదు. అయితే మంచి ధరకు టీవీ9 చానల్స్‌ను అమ్మేందుకు సిద్ధంగాఉన్నట్టు చెబుతున్నారు. జీ టీవీతో డీల్‌పై కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

Click on Image to Read:

konatala-ramakrishna

mla-ramakrishna

jeevitha

tdp-mps-and-mlas

First Published:  27 Sep 2016 1:14 AM GMT
Next Story