Telugu Global
NEWS

శభాష్ చంద్రబాబు

రిక్టర్ స్కేల్‌పై 10 తీవ్రత ఉన్న భూపంకం చూసిన వారికి పదేపదే వచ్చే చిన్నచిన్న ప్రకంపనాలు ఒక లెక్కనా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కూడా అలాగే ఉంది. ఓటుకు నోటు కేసులో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అడ్డంగా దొరికినప్పటికీ దర్జాగా ఆయన బయటే తిరుగుతున్న వైనం చూసి టీడీపీ నేతల్లోనూ అవినీతి ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగినట్టుగా ఉంది. ఎలాగో ఆంధ్రప్రదేశ్‌కు అంటువ్యాధిలా తయారైన మీడియా ఉండనే ఉంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా 5 కోట్లు డిమాండ్ […]

శభాష్ చంద్రబాబు
X

రిక్టర్ స్కేల్‌పై 10 తీవ్రత ఉన్న భూపంకం చూసిన వారికి పదేపదే వచ్చే చిన్నచిన్న ప్రకంపనాలు ఒక లెక్కనా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కూడా అలాగే ఉంది. ఓటుకు నోటు కేసులో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అడ్డంగా దొరికినప్పటికీ దర్జాగా ఆయన బయటే తిరుగుతున్న వైనం చూసి టీడీపీ నేతల్లోనూ అవినీతి ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగినట్టుగా ఉంది. ఎలాగో ఆంధ్రప్రదేశ్‌కు అంటువ్యాధిలా తయారైన మీడియా ఉండనే ఉంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా ఎక్కడా చర్చ లేదు. చంద్రబాబు వైపు నుంచి చర్యలు కూడా లేవు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే రూ. 5కోట్లు డిమాండ్ చేస్తూ దొరికితే దేశంలోనే అదో పెద్ద సంచలనం కావాలి. సదరుపార్టీ సిగ్గుతో తలదించుకుని కుమిలిపోవాలి. మీడియా గగ్గోలు పెట్టాలి. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌ను 5కోట్లు డిమాండ్ చేస్తున్న ఆడియో టేపులు బయటకు వచ్చాయి. సదరు కాంట్రాక్టరు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే బెదిరించారని చెప్పారు. కానీ తెలుగు టీవీ ఛానళల్లో ఆ అంశం గురించి కవరేజ్‌ అస్సలు లేదు. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే టీవీ ఛానళ్లు కూడా పచ్చబారిపోయాయి. ఒకటి రెండు టీవీ ఛానళ్లు మినహాయిస్తే మరే మీడియా సంస్థ కూడా టీడీపీ ఎమ్మెల్యే డబ్బుల వ్యవహారాన్ని ప్రసారం చేయడం లేదు. ముద్రగడ దీక్ష సమయంలో 14 రోజుల పాటు కాపుల వార్తలపై ఏ తరహాలో నిషేధం కొనసాగించాయో అదే తరహాలో టీడీపీ ఎమ్మెల్యే ముడుపుల మ్యాటర్‌ను కప్పేశాయి. ఇదంతా ఎమ్మెల్యే గొప్పతనం కాదు. చంద్రబాబు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌. ఉండకూడని దురాభిమానులు ఉన్న వ్యక్తుల చేతిలో తెలుగు మీడియా బంధి అయ్యే సరికి ఇలా సంచలన వార్తలు కూడా చెత్త వార్తలు అవుతున్నాయి. గతంలో పది వేలు లంచం తీసుకోబోయారన్న ఆరోపణలపైనే ఏకంగా ఒక మంత్రిని బర్తరఫ్ చేసిన ఘనత ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీకి ఉంది.

కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే రూ. 5కోట్లు లంచం తీసుకునేందుకు సిద్ధమైన అంశం ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా కనీసం షోకాజ్ నోటీస్ జారీ చేసే సామర్థ్యం కూడా టీడీపీ నాయకత్వానికి లేకుండాపోయింది. ఒక ఉద్యోగి వెయ్యిరూపాయలు లంచం తీసుకుంటే బ్రేకింగ్‌ న్యూస్ అంటూ పచ్చడిపచ్చడి చేసే పచ్చ మీడియా అదే టీడీపీ ఎమ్మెల్యే రూ. 5కోట్లు మామూళ్లు తీసుకునేందుకు సిద్ధపడితే మాత్రం మాట్లాడదు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్లేసులో ఏ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యే ఉండి ఉన్నా కూడా తెలుగు టీవీ ఛానళ్లు ఇలాగే మౌనముద్రలో ఉండేవా?. అస్సలు ఉండవు. ధర్మస్థాపనకు తాము పుట్టినట్టుగా రోజుల తరబడి గబ్బులేపి వదిలేసేవి. ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఊగిపోయేవి. కానీ ఇప్పుడు దొరికింది తమ పచ్చపార్టీ ఎమ్మెల్యే కావడంతోనే టీవీ ఛానళ్లు అన్ని కళ్లుమూసుకున్నాయి. అసలు ఆ విషయం తమ దృష్టికి రానట్టుగా బిల్డప్ ఇస్తున్నాయి. ఏదీ ఏమైనా రూ. 5కోట్లు డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే గురించి వార్త కూడా ఇవ్వకుండా పచ్చమీడియాను తన పాదాల కింద అణచిపెట్టుకున్న చంద్రబాబును మాత్రం శభాష్ అని మెచ్చుకోవాల్సిందే.

Click on Image to Read:

tv-9

konatala-ramakrishna

mla-ramakrishna

First Published:  27 Sep 2016 1:26 AM GMT
Next Story