Telugu Global
Cinema & Entertainment

రామ్ హీరోయిన్  కు జాక్ పాట్..! 

నేను శైల‌జా  చిత్రంతో  టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన  త‌మిళ‌మ్మాయి  కీర్తీ సురేష్    ప్ర‌స్తుతం  ధ‌నుష్ తో చేసిన రైల్ చిత్రంతో  తెలుగు అభిమానుల్ని మ‌రోసారి అల‌రిస్తుంది. ఈ చిత్రంలో మేక‌ప్ లేకుండా న‌టించి ఎంత‌గానో అభిమానుల్ని మెప్పిస్తుంది.  ఈ ముద్దుగుమ్మకు  బ‌న్నీ స‌ర‌స‌న  చాన్స్  వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ దువ్వాడ జ‌గ‌న్నాధం చిత్రం చేస్తున్నాడు.  ఇది కంప్లీట్ అవ్వ‌గానే   త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఒక చిత్రం చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌నే […]

రామ్ హీరోయిన్  కు జాక్ పాట్..! 
X
నేను శైల‌జా చిత్రంతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన త‌మిళ‌మ్మాయి కీర్తీ సురేష్ ప్ర‌స్తుతం ధ‌నుష్ తో చేసిన రైల్ చిత్రంతో తెలుగు అభిమానుల్ని మ‌రోసారి అల‌రిస్తుంది. ఈ చిత్రంలో మేక‌ప్ లేకుండా న‌టించి ఎంత‌గానో అభిమానుల్ని మెప్పిస్తుంది. ఈ ముద్దుగుమ్మకు బ‌న్నీ స‌ర‌స‌న చాన్స్ వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ దువ్వాడ జ‌గ‌న్నాధం చిత్రం చేస్తున్నాడు.
ఇది కంప్లీట్ అవ్వ‌గానే త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఒక చిత్రం చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌నే వార్త‌లు ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో ఆల్మోస్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన‌ట్లేన‌ని కోలీవుడ్ టాక్. నిజంగా ఇది కీర్తీకి మంచి బ్రేక్ అనే అంటున్నారు ప‌రిశీల‌కులు మ‌రి. నిజ‌మే ..బ‌న్నీ వంటి యంగ్ స్టార్ స‌ర‌స‌న హీరోయిన్ చాన్స్ వ‌స్తే .. ఆఫ‌ర్ల ప‌రంగా…క్రేజ్ ప‌రంగా ఒక మెట్టు నుంచి ప‌ది మెట్లు ఎక్కిన‌ట్లే క‌దా. బ‌న్నీ న‌టించిన రెసు గుర్రం.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. ఈ మ‌ధ్య వచ్చిన స‌రైనోడు చిత్రాలు 50 కోట్లు పైగా వ‌సూలు చేసి బ‌న్నీని క‌మ‌ర్షియ‌ల్ స్టార్స్ లిస్ట్ లో నిలిపిన విష‌యం తెలిసిందే.
First Published:  27 Sep 2016 4:51 AM GMT
Next Story