Telugu Global
Cinema & Entertainment

కాటమరాయుడు ఫస్ట్ లుక్ ఇదే...

పవన్ ఇలా సెట్స్ పైకి వచ్చాడో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈనెల 24 నుంచి పవన్ సెట్స్ పైకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ నిన్నట్నుంచి పవన్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చాడు. వచ్చిన వెంటనే లొకేషన్ లో పవన్ అంటూ నిర్మాత శరత్ మరార్ ఓ ఫోటో ట్వీట్ చేశాడు. లుంగీ కట్టుకొని, చేతిలో టీ కప్పు పట్టుకొని కుర్చీలో దర్జాగా కూర్చున్న పవన్ ఫోటో చూసి ఫ్యాన్స్ […]

కాటమరాయుడు ఫస్ట్ లుక్ ఇదే...
X

పవన్ ఇలా సెట్స్ పైకి వచ్చాడో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈనెల 24 నుంచి పవన్ సెట్స్ పైకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ నిన్నట్నుంచి పవన్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చాడు. వచ్చిన వెంటనే లొకేషన్ లో పవన్ అంటూ నిర్మాత శరత్ మరార్ ఓ ఫోటో ట్వీట్ చేశాడు. లుంగీ కట్టుకొని, చేతిలో టీ కప్పు పట్టుకొని కుర్చీలో దర్జాగా కూర్చున్న పవన్ ఫోటో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అంతేకాదు.. ఆ స్టిల్ నే.. సినిమాకు అఫీషియల్ ఫస్ట్ లుక్ గా కూడా ప్రచారం చేస్తున్నారు. కాటమరాయుడు సినిమా ఫస్ట్ లుక్ ఇదే నంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా నడుస్తోంది. నిజంగా ఫస్ట్ లుక్ రేంజ్ లోనే ఆ స్టిల్ కూడా ఉంది. పైగా కాటమరాయుడి సినిమాలో పవన్ గెటప్ ఎలా ఉండబోతోందనే విషయానికి కూడా ఆ ఫొటోనే పెద్ద సమాధానంగా నిలిచింది. అలా ఆ ఒక్క ఫొటోతో కాటమరాయుడు ప్రాజెక్టుకు ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది.

First Published:  27 Sep 2016 4:42 AM GMT
Next Story