Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమా సెట్స్ లో పుట్టినరోజు సందడి

ఓ స్టార్ హీరో సమక్షంలో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఎప్పుడూ థ్రిల్ గానే ఉంటుంది. ఆ స్టార్ హీరో స్వయంగా వేడుకల్ని దగ్గరుండి జరిపిస్తే ఆ సంబరమే వేరు. పైగా సోషల్ మీడియాలో కూడా దానిపై రెస్పాండ్ అయితే… ఆ ఈవెంట్ కలకాలం గుర్తుండిపోతుంది. మహేష్ సినిమా సెట్స్ లో అదే జరిగింది. ఆ సినిమా దర్శకుడు మురుగదాస్ నిన్న తన పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. పైగా మహేష్ దగ్గరుండి తన దర్శకుడికి […]

మహేష్ సినిమా సెట్స్ లో పుట్టినరోజు సందడి
X

ఓ స్టార్ హీరో సమక్షంలో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఎప్పుడూ థ్రిల్ గానే ఉంటుంది. ఆ స్టార్ హీరో స్వయంగా వేడుకల్ని దగ్గరుండి జరిపిస్తే ఆ సంబరమే వేరు. పైగా సోషల్ మీడియాలో కూడా దానిపై రెస్పాండ్ అయితే… ఆ ఈవెంట్ కలకాలం గుర్తుండిపోతుంది. మహేష్ సినిమా సెట్స్ లో అదే జరిగింది. ఆ సినిమా దర్శకుడు మురుగదాస్ నిన్న తన పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. పైగా మహేష్ దగ్గరుండి తన దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు.. మురుదగాస్ తో కలిసి పనిచేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నానని, అతడితో వర్క్ చేయడం చాలా బాగుందని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇలా నిన్నంతా మురుగదాస్ పుట్టినరోజును టాలీవుడ్ ప్రముఖులు, మహేష్ అభిమానులు గ్రాండ్ గా జరుపుకున్నారు. కెరీర్ లోనే తొలిసారిగా మహేష్ మూలంగా మురుగదాస్ పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్ లోకూడా జరగడం విశేషం. ప్రస్తుతం మహేష్-మురుగదాస్ సినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. ఈ సినిమాకు శివ లేదా అభిమన్యుడు అనే టైటిల్స్ అనుకుంటున్నారు. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు టైటిల్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

First Published:  26 Sep 2016 11:47 AM GMT
Next Story