Telugu Global
Cinema & Entertainment

తెలుగు హీరోల సాంబార్ కలలు

రజనీకాంత్, సూర్య, విక్రమ్, కార్తి, విశాల్ ఇలా చాలామంది తమిళ స్టార్లు తెలుగుతెరపైకి వచ్చినవాళ్లే. తమ సినిమాల్ని కచ్చితంగా తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటారు. వీళ్లే కాకుండా చిన్నాచితక పేరున్న జీవ, శివకార్తికేయన్, విజయ్ ఆంటోనీ, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి హీరోలు కూడా తెలుగుతెరను వదలరు. కానీ ఇట్నుంచి అటు మాత్రం తాకిడి కాస్త తక్కువే. తెలుగు హీరోలు తమిళ్ కు వెళ్లి ఎగ్రెసివ్ ప్రమోషన్ తో డబ్బులు కొల్లగొట్టిన దాఖలాలు అరుదు. […]

తెలుగు హీరోల సాంబార్ కలలు
X

రజనీకాంత్, సూర్య, విక్రమ్, కార్తి, విశాల్ ఇలా చాలామంది తమిళ స్టార్లు తెలుగుతెరపైకి వచ్చినవాళ్లే. తమ సినిమాల్ని కచ్చితంగా తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటారు. వీళ్లే కాకుండా చిన్నాచితక పేరున్న జీవ, శివకార్తికేయన్, విజయ్ ఆంటోనీ, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి హీరోలు కూడా తెలుగుతెరను వదలరు. కానీ ఇట్నుంచి అటు మాత్రం తాకిడి కాస్త తక్కువే. తెలుగు హీరోలు తమిళ్ కు వెళ్లి ఎగ్రెసివ్ ప్రమోషన్ తో డబ్బులు కొల్లగొట్టిన దాఖలాలు అరుదు. కానీ ఇప్పుడు మన స్టార్లు కూడా రూటు మార్చారు.

బన్నీ ఇప్పుడు నేరుగా తెలుగు-తమిళ భాషల్లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. లింగుస్వామి దర్శకత్వంలో ఈమధ్యే ఓ సినిమాకు ఓకే చెప్పాడు. స్టుడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుంది. బన్నీ కంటే ముందే హీరో మహేష్ బాబు కూడా తమిళనాడుపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాడు. అటు బాహుబలితో కోలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్… సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న నెక్ట్స్ సినిమాను కోలీవుడ్ కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాాడు. ఇలా చాలామంది హీరోలు, ఇప్పుడిప్పుడే తమిళ పరిశ్రమపై సీరియస్ గా దృష్టిపెడుతున్నారు.

First Published:  24 Sep 2016 7:32 AM GMT
Next Story