Telugu Global
NEWS

అనుకున్న‌దే అయింది... ఎస్సై రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య కేసు ప‌క్క‌దారి ప‌ట్టింది!

ఉన్న‌తాధికారుల వేధింపులు భ‌రించ‌లేక స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుకునూరు ఎస్సై రామ‌కృష్ణారెడ్డి కేసు ప‌క్క‌దారి ప‌ట్టింది. చ‌నిపోయే ముందు త‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మంటూ కొంద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పేర్ల‌తో కూడిన లేఖ రాశాడు. కానీ అత‌ని మృతిపై న‌మోదైన ఎఫ్‌.ఐ.ఆర్‌లో రామ‌కృష్ణారెడ్డి ఆరోపించిన వారి పేర్లేమీ లేక‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. దీంతో రామ‌కృష్ణారెడ్డి భార్య ధ‌న‌ల‌క్ష్మి హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై స్పందించిన హైకోర్టు వారి పేర్లు ఎందుకు చేర్చ‌లేదో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని రాష్ట్ర […]

అనుకున్న‌దే అయింది... ఎస్సై రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య కేసు ప‌క్క‌దారి ప‌ట్టింది!
X
ఉన్న‌తాధికారుల వేధింపులు భ‌రించ‌లేక స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుకునూరు ఎస్సై రామ‌కృష్ణారెడ్డి కేసు ప‌క్క‌దారి ప‌ట్టింది. చ‌నిపోయే ముందు త‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మంటూ కొంద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పేర్ల‌తో కూడిన లేఖ రాశాడు. కానీ అత‌ని మృతిపై న‌మోదైన ఎఫ్‌.ఐ.ఆర్‌లో రామ‌కృష్ణారెడ్డి ఆరోపించిన వారి పేర్లేమీ లేక‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. దీంతో రామ‌కృష్ణారెడ్డి భార్య ధ‌న‌ల‌క్ష్మి హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై స్పందించిన హైకోర్టు వారి పేర్లు ఎందుకు చేర్చ‌లేదో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని రాష్ట్ర హోంశాఖ‌కు ఆదేశాలు జారీ చేసింది.
వాస్త‌వానికి ఈ కేసు విచార‌ణ‌పై మొద‌టి నుంచి అనుమానాలే ఉన్నాయి. రామ‌కృష్ణారెడ్డి ఆత్మ‌హ‌త్య‌తో ప్ర‌భుత్వం అప్ప‌టిక‌ప్పుడు కంటితుడుపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్న సిద్ధిపేట డీఎస్పీ శ్రీ‌ద‌ర్‌ను తాత్కాలికంగా విధుల‌నుంచి త‌ప్పించారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణాధికారిగా నిజామాబాద్ ఏ ఎస్పీ ప్ర‌తాప‌రెడ్డిని నియ‌మించారు. ఆయ‌న ప్రాథ‌మిక వివ‌రాలు సేక‌రించ‌కముందే.. రామ‌కృష్ణారెడ్డి తీవ్ర నిందారోప‌ణ‌లు చేశాడు. తాగి కాల్చుకున్నాడ‌ని పోస్టుమార్టం నివేదిక రాక‌ముందే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తేల్చేశాడు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ప్ర‌భుత్వం ఈ విచార‌ణ‌లో అత‌ని ప‌రిధి త‌గ్గించింది. కేసు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ అకున్ స‌బ‌ర్వాల్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. ప్ర‌తాప‌రెడ్డిని డీజీపీ మంద‌లించారు. ఇవ‌న్నీ ఎఫ్‌.ఐ.ఆర్ రాసేంత వ‌ర‌కు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రాకుండా తీసుకున్న చ‌ర్య‌లేన‌ని ఎస్‌.ఐ కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. తీరా ఇంత‌మంది విచార‌ణ‌జ‌రిపినా.. నిందితుల పేర్లు ఎఫ్‌.ఐ.ఆర్‌లో లేక‌పోవ‌డంతో వారిని కాపాడేందుకు ఎవరు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది.

Click on Image to Read:

uma-reddy-venkateswarlu

devineni-nehru-avinash

chittoor-mayor-katari-anuradha

First Published:  16 Sep 2016 11:24 PM GMT
Next Story