Telugu Global
NEWS

విమోచ‌నంపై టీఆర్ ఎస్ పంథా స‌క్ర‌మ‌మేనా?

సెప్టెంబ‌రు 17 విమోచ‌న‌మా?  విలీన‌మా? అన్న అంశంపై ఈ ఏడాది జ‌రుగుతున్న చ‌ర్చ ఇంత‌కుముందెన్న‌డూ జ‌రగ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే.. విమోచ‌న దినంగా జ‌ర‌పాల‌ని బీజేపీ నేత‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా డోంట్ కేర్‌.. మా వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింది.. ఇంకా మాట్లాడితే.. త‌మ పార్టీ కూడా తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొంది అంటున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి విలీనంవైపే మొగ్గు చూపుతోంది. […]

విమోచ‌నంపై టీఆర్ ఎస్ పంథా స‌క్ర‌మ‌మేనా?
X
సెప్టెంబ‌రు 17 విమోచ‌న‌మా? విలీన‌మా? అన్న అంశంపై ఈ ఏడాది జ‌రుగుతున్న చ‌ర్చ ఇంత‌కుముందెన్న‌డూ జ‌రగ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే.. విమోచ‌న దినంగా జ‌ర‌పాల‌ని బీజేపీ నేత‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా డోంట్ కేర్‌.. మా వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింది.. ఇంకా మాట్లాడితే.. త‌మ పార్టీ కూడా తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొంది అంటున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి విలీనంవైపే మొగ్గు చూపుతోంది. ఇది స‌మంజ‌స‌మేనా? కాదా? అన్న చ‌ర్చ కూడా సాగుతోంది. అదృష్ట‌వ‌శాత్తూ ఈ విష‌యంలో ఒక్క బీజేపీ త‌ప్ప అన్ని పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉండ‌టం అధికార టీఆర్ ఎస్‌కు చాలా ఊర‌టనిచ్చే అంశం.
టీఆర్ ఎస్‌.. ఈ పార్టీ ఏ ముహూర్తాన పెట్టారో గానీ.. ఆరంభం నుంచి సంచ‌ల‌నాలే! 2001లో తెలుగుదేశం నుంచి బ‌య‌టికి వ‌చ్చిన కేసీఆర్, మాజీ బీజేపీ నేత ఆలెన‌రేంద్ర‌తో క‌లిసి తెలంగాణ రాష్ట్ర స‌మితిని ప్రారంభించారు. తొలినాళ్ల‌లో అనేక సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. స్థానిక సంస్థ‌ల్లో గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. ఈలోగా 2004 ఎన్నిక‌లు కాంగ్రెస్ తో పొత్తు, తెగ‌దెంపులు… 2009 వ‌ర‌కు అనేక ఆటుపోట్ల‌కు గురైంది. 2009లో కేసీఆర్ దీక్ష తెలంగాణ స‌మాజాన్ని ఉద్య‌మం వైపు న‌డిచింది. ఒక‌ద‌శ‌లో కేసీఆర్ కంటే విద్యార్థులు, సామాన్య ప్ర‌జ‌లే ఉద్య‌మాన్ని న‌డిపారంటే వారిలో ఆయ‌న నాటిన ఉద్య‌మ స్ఫూర్తే కార‌ణం. ప్ర‌జ‌లు ఉద్య‌మంలో భాగ‌స్వాముల‌య్యాక ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మానేశారు కేసీఆర్‌. ఈ ద‌శ‌లోనే ఆయ‌న తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం జ‌ర‌పాలంటూ డిమాండ్ చేశారు. కానీ, 2012 త‌రువాత ఈవిష‌యంలో ఆయ‌న వైఖ‌రి పూర్తిగా మారింది. విమోచ‌న దినం నిర్వ‌హిస్తే ముస్లింల‌కు త‌మ పార్టీ దూర‌మ‌వుతుంద‌ని ముందుగానే గ్ర‌హించి ఆ ఆలోచ‌న విర‌మించుకున్నారు. 2013 సెప్టెంబ‌రు 17న విలీన దినంగానేపాటించారు కేసీఆర్‌. ఈ ప‌రిణామం చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగించినా.. రాజ‌కీయ విశ్లేష‌కులు కేసీఆర్ వ్యూహాన్ని ప‌సిగ‌ట్టారు. ముస్లింల‌ను క‌లుపుకొని పోయేందుకు ఆయ‌న విలీనం వైపు మొగ్గు చూపుతున్నార‌ని గుర్తించారు.
హైద‌రాబాద్‌ విలీనం స‌మ‌యంలో సైనిక‌చ‌ర్య జ‌రిగింది. అనంత‌రం కొన్ని ముస్లిం కుటుంబాల‌పై దాడులు జ‌రిగాయి. దాంతో వారిలో కొంచెం అభ‌ద్ర‌త‌భావం నెల‌కొంది. ఇక‌పై ప్ర‌తి ఏటా ఇలా విమోచ‌నం నిర్వ‌హిస్తే.. ముస్లింలు పార్టీకి పూర్తిగా దూర‌మ‌వుతార‌న్న‌ది నిర్వివాదాంశం. తెలంగాణ‌లో ఎలాగూ బ‌లం లేని బీజేపీ ఈ అంశాన్ని నెత్తినెత్తుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గోవ‌ధ వ్య‌తిరేక ప్ర‌చారం, ఘ‌ర్ వాప‌సీ త‌దిత‌ర ముస్లిం వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌తో ఇప్ప‌టికీ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ విమోచ‌నం విష‌యం వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకునే స్థితిలో లేదు. ఇటీవ‌ల గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మైనా బీజేపీ తీరు మార‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Click on Image to Read:

devineni-nehru-avinash

nayeem-political-leaders-1

mp-thota-narasimha

uma-reddy-venkateswarlu

jaleel-khan

devineni-nehru

andhra-pradesh-capital-city

chittoor-mayor-katari-anuradha

First Published:  15 Sep 2016 10:08 PM GMT
Next Story