Telugu Global
NEWS

అమరావతి ఒక విస్పోటనమే..

అమరావతి నిర్మాణంపై నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ ”ఎన్‌ఏపీఎం” జాతీయ సమన్వయకర్త రామకృష్ణమరాజు ఆందోళన వ్యక్తం చేశారు.అమరావతి ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక విస్పోటనంలా మారబోతోందని ఒక ప్రముఖపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో విస్పోటనం కంటే తక్కువ తీవ్రత ఉన్న పదాన్ని తాను వాడలేకపోతున్నానని చెప్పారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయన్నారు. వేర్పాటువాద ఉద్యమాలకు అమరావతి కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని శివరామకృష్ణన్ కమిటీ […]

అమరావతి ఒక విస్పోటనమే..
X

అమరావతి నిర్మాణంపై నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ ”ఎన్‌ఏపీఎం” జాతీయ సమన్వయకర్త రామకృష్ణమరాజు ఆందోళన వ్యక్తం చేశారు.అమరావతి ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక విస్పోటనంలా మారబోతోందని ఒక ప్రముఖపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో విస్పోటనం కంటే తక్కువ తీవ్రత ఉన్న పదాన్ని తాను వాడలేకపోతున్నానని చెప్పారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయన్నారు. వేర్పాటువాద ఉద్యమాలకు అమరావతి కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని శివరామకృష్ణన్ కమిటీ అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలని సూచించిందన్నారు.

రాజధాని నిర్మాణం పేరుతో పంటపొలాలను నాశనం చేసి పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని, ప్రభుత్వమే నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, విదేశీ కంపెనీల ముందు మోకరిల్లడం ఇవన్నీ విస్పోటనాలకు కారణం కాబోతున్నాయన్నారు. 3000 ఎకరాలు అవసరమైన రాజధానికి 50వేల ఎకరాలు సేకరించడం అంటే అది కేవలం రియల్ఎస్టేట్ వ్యాపారం, అవినీతి కోసం తప్పించి మరేందుకూ కాదన్నారు. చంద్రబాబు పాలనలో మితిమీరిన అవినీతిని ఆ పార్టీతో భాగస్వామిగా ఉన్న నరేంద్ర మోదీ ఎలా సమర్ధిస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు రామకృష్టంరాజు . ప్రపంచ స్థాయి రాజధాని అంటూ భూతద్దంలో చూపించడం వదిలేసి తొలుత విద్యా, వైద్యం, వంటి మౌలిక సదుపాయాలకు కేంద్రంగా రాజధానిని నిర్మించాలని సూచించారు.

Click on Image to Read:

governor-narasimhan-chandrababu-naidu-1

single-women-mumbai

swiss-challenge

sabbam-hari

c-ramachandraiah

janasena-book

pawan-janasena

andhra-pradesh-intellectuals

ntr

pawan

kottapalli-geeta

rajashekar-reddy-ysr

chandrababu-naidu-01

chintakayala-chinna-rajappa

First Published:  13 Sep 2016 10:52 PM GMT
Next Story