Telugu Global
Cinema & Entertainment

గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ రిలీజ్

బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల లీకైన కొన్ని ఫొటోలు నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే సినిమా యూనిట్ నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. ఎట్టకేలకు యూనిట్ నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. ఆదివారం శ్రియ పుట్టినరోజు సందర్భంగా… శాతకర్ణి సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. […]

గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ రిలీజ్
X

బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల లీకైన కొన్ని ఫొటోలు నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే సినిమా యూనిట్ నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. ఎట్టకేలకు యూనిట్ నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. ఆదివారం శ్రియ పుట్టినరోజు సందర్భంగా… శాతకర్ణి సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులోశ్రియ పాత్ర పేరు వశిష్టి దేవి. శాతకర్ణికి భార్యగా, ఓ పిల్లాడికి తల్లిగా నటిస్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి…. శ్రియ పుట్టినరోజును పురస్కరించుకొని దర్శకుడు క్రిష్… ఆమె ఫల్ట్ లుక్ ను విడుదల చేశాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను బాలయ్య కెరీర్‌కు మరపురాని సినిమాగా నిలిపేలా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్. అంతేకాదు… బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

First Published:  11 Sep 2016 10:27 PM GMT
Next Story