Telugu Global
NEWS

"ఇలా చేవచచ్చి ఉండడం ఎందుకు?"- చంద్రబాబుకు ఉండవల్లి సలహా

 బీజేపీ, టీడీపీ కలిసి హోదా విషయంలో ఏపీకి పంగనామం పెట్టడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. స్పెషల్ స్టేటస్ సంగతేమో గానీ అసలు దేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఏంటో కూడా అర్థం కావడం లేదన్నారు. ఏపీ అంటే ఎందుకింత చిన్నచూపు అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు ప్రజలు అత్యంత బాధపడిన సందర్భం ఇదేనన్నారు. తెలుగు ప్రజలు మరోసారి వంచనకు గురయ్యారని చెప్పారు. లోటు బడ్జెటే పూరించని వాళ్లు ఇక ప్యాకేజ్‌ ఇస్తామంటే […]

ఇలా చేవచచ్చి ఉండడం ఎందుకు?- చంద్రబాబుకు ఉండవల్లి సలహా
X

బీజేపీ, టీడీపీ కలిసి హోదా విషయంలో ఏపీకి పంగనామం పెట్టడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. స్పెషల్ స్టేటస్ సంగతేమో గానీ అసలు దేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఏంటో కూడా అర్థం కావడం లేదన్నారు. ఏపీ అంటే ఎందుకింత చిన్నచూపు అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు ప్రజలు అత్యంత బాధపడిన సందర్భం ఇదేనన్నారు. తెలుగు ప్రజలు మరోసారి వంచనకు గురయ్యారని చెప్పారు. లోటు బడ్జెటే పూరించని వాళ్లు ఇక ప్యాకేజ్‌ ఇస్తామంటే ఎలా నమ్మాలన్నారు. చంద్రబాబుకు ఏది సంతోషమే కేంద్రం కూడా అదే చెబుతోందన్నారు. నేషనల్ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని రాష్ట్రప్రభుత్వానికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అలా చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందన్నారు.

ఏపీకి హోదా అన్నది తాత్కాలికమే కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా అభ్యంతరం చెప్పడం లేదన్నారు. చివరకు టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా ఏపీకి హోదా ఇవ్వాలంటున్నారని ఉండవల్లి గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. చూస్తుంటే ఏదైనా తీవ్ర నేరం చేసి దొరికిపోయారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు ఈ వయసులో రెండోసారి ముఖ్యమంత్రి అయి ఇలా చేవచచ్చిన వ్యక్తిలా ఎందుకు ఉండాల్సి వస్తోందని ఉండవల్లి మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఏపీకి కేంద్రం చేసిన మోసాన్ని ఉత్తరప్రదేశ్‌ వెళ్లి అక్కడి ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించాలని సలహా ఇచ్చారు. అలా చేస్తే కేంద్రం వెంటనే దిగివస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు ఉండవల్లి.

Click on Image to Read:

ap-assembly

venkaiah-naidu

chevireddy-bhasar-reddy

kodela shiva rama krishna 1

mla-anitha

pvnarasimharao-kotla-vijaya-bhaskar-reddy

ktr

chandrababu-shasanamandali

purandeswari-ys-jagan

avanthi-srinivas-haribabu

koratala-siva-vs-boyapati-srinu

ys-jagan-chit-chat

vishnukumar-raj

gorantla-buchaiah-chowdary

First Published:  9 Sep 2016 1:47 AM GMT
Next Story