Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా సిద్ధమౌతున్న ఫిదా...

శేఖర్ కమ్ముల రూటు మార్చాడు. గతంలోలా నిదానంగా సినిమాలు తీసే అలవాటును పక్కనపెట్టినట్టు కనిపిస్తున్నాడు. నిన్నగాక మొన్న ప్రారంభించిన ఫిదా సినిమాకు సంబంధించి అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశాడు కమ్ముల. ఈ సినిమాలో వరుణ్ తేజ, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కమ్ముల సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. వరుణ్ తేజ ఓ ఎన్నారైగా మనకు కనిపించబోతున్నాడు. అప్పుడే అమెరికా నుంచి […]

శరవేగంగా సిద్ధమౌతున్న ఫిదా...
X

శేఖర్ కమ్ముల రూటు మార్చాడు. గతంలోలా నిదానంగా సినిమాలు తీసే అలవాటును పక్కనపెట్టినట్టు కనిపిస్తున్నాడు. నిన్నగాక మొన్న ప్రారంభించిన ఫిదా సినిమాకు సంబంధించి అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశాడు కమ్ముల. ఈ సినిమాలో వరుణ్ తేజ, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కమ్ముల సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. వరుణ్ తేజ ఓ ఎన్నారైగా మనకు కనిపించబోతున్నాడు. అప్పుడే అమెరికా నుంచి ల్యాండ్ అయిన అబ్బాయిగా వరుణ్ తేజ కనిపిస్తాడు.

శేఖర్ కమ్ముల ఓ సినిమా ఎనౌన్స్ చేశాడంటే… అది థియేటర్లలోకి వచ్చేసరికి కనీసం ఏడాది పడుతుంది. స్టార్ కాస్ట్ సెలక్షన్ నుంచి వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, సెట్స్ పైకి తీసుకొచ్చే వరకు ప్రతి అంశాన్ని కమ్ములే దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అందుకే సినిమా తెరపైకి రావడానికి అంత టైం పడుతుంది. ఈసారి మాత్రం కమ్ముల కాస్త స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తిచేసి థియేటర్లలోకి రావాలనుకుంటున్నాడు కమ్ముల. ఎందుకంటే.. ఈ దర్శకుడి కెరీర్ లో ఇప్పటికే లాంగ్ గ్యాప్ వచ్చేసింది.

First Published:  8 Sep 2016 9:36 PM GMT
Next Story