Telugu Global
Cinema & Entertainment

జనతాను అడ్డుకునే సినిమా ఏది...?

ఈ వీకెండ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు కొన్ని లైన్లో ఉన్నాయి. వీటిలో విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమా ఈరోజు ఆల్రెడీ థియేటర్లలోకి రాగా… మరో 3 సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుంది… జనతా గ్యారేజ్ ప్రభంజనాన్ని అడ్డుకునే సత్తా వీటిలో దేనికి ఉందే డిస్కషన్ ఇప్పటికే షురూ అయింది. విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇంకొక్కడు. ప్రీవియస్ మూవీ “ఐ “తో అంతగా అలరించలేకపోయిన విక్రమ్.. ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే […]

జనతాను అడ్డుకునే సినిమా ఏది...?
X

ఈ వీకెండ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు కొన్ని లైన్లో ఉన్నాయి. వీటిలో విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమా ఈరోజు ఆల్రెడీ థియేటర్లలోకి రాగా… మరో 3 సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుంది… జనతా గ్యారేజ్ ప్రభంజనాన్ని అడ్డుకునే సత్తా వీటిలో దేనికి ఉందే డిస్కషన్ ఇప్పటికే షురూ అయింది.

విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇంకొక్కడు. ప్రీవియస్ మూవీ “ఐ “తో అంతగా అలరించలేకపోయిన విక్రమ్.. ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. అందుకే ఇంకొక్కడు పేరుతో మరో ప్రయోగాన్ని తెరపైకి తెచ్చాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు… నయన్ గ్లామర్ డోస్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది.

రేపు థియేటర్లలోకి రాబోతోంది జ్యో అచ్యుతానంద మూవీ. ఈ సినిమా కూడా ట్రయిలర్ తో బాగానే ఆకట్టుకుంది. అవసరాల శ్రీనివాస్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా నటించారు. ఇద్దరూ కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో పాటు ఒకే అమ్మాయిని లైన్లో పెట్టడం కోసం ప్రయత్నించడం సినిమాకు హైలెట్. ఇక శ్రీకాంత్ నటించిన మెంటల్ సినిమా కూడా రేపే విడుదలకాబోతోంది. టైటిల్ తో వివాదం సృష్టించి నలుగురి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి. వీటిలో ఏ సినిమా జనతా గ్యారేజ్ ను అడ్డుకుంటుందో చూడాలి.

First Published:  7 Sep 2016 9:40 PM GMT
Next Story