Telugu Global
National

పత్రికా రచయితల గుండె చప్పుడు

అస్సాంలోని మొరిగాం జిల్లాలో మొయిరాబరి ఓ మారు మూల గ్రామం. ఆ గ్రామం తరచుగా వరదలకు గురవుతూ ఉంటుంది. అక్కడ ఓ ప్రెస్ క్లబ్ ఉంది. అందులో ఉన్నది తొమ్మిది మంది పత్రికా రచయితలే. కాని వెనుకబడిన ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందించడానికి ఆ ప్రెస్ క్లబ్ వినూత్నమైన ప్రయోగం చేస్తోంది. మొయిరాబాద్ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలియజేస్తూ 2015 ఫిబ్రవరినుంచి http://mpcnews.co/ అనే వెబ్ పోర్టల్ నిర్వహిస్తోంది. ఇందులో కేవలం స్థానిక వార్తలు […]

పత్రికా రచయితల గుండె చప్పుడు
X

అస్సాంలోని మొరిగాం జిల్లాలో మొయిరాబరి ఓ మారు మూల గ్రామం. ఆ గ్రామం తరచుగా వరదలకు గురవుతూ ఉంటుంది. అక్కడ ఓ ప్రెస్ క్లబ్ ఉంది. అందులో ఉన్నది తొమ్మిది మంది పత్రికా రచయితలే. కాని వెనుకబడిన ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందించడానికి ఆ ప్రెస్ క్లబ్ వినూత్నమైన ప్రయోగం చేస్తోంది. మొయిరాబాద్ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలియజేస్తూ 2015 ఫిబ్రవరినుంచి http://mpcnews.co/ అనే వెబ్ పోర్టల్ నిర్వహిస్తోంది. ఇందులో కేవలం స్థానిక వార్తలు మాత్రమే ఉంటాయి. అవన్నీ అక్కడి ప్రజలకు ఉపయుక్తమైన వార్తలే.

మొయిరాబాద్ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. జనుము, వేరుశనగ, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండిస్తారు. అది ఓ చిన్న పంచాయితీ. అయితే అక్కడ నేరాలకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కొదవలేదు. ఈ రుగ్మతల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడానికి ప్రెస్ క్లబ్ సభ్యులు వెబ్ పోర్టల్ ప్రారంభించారు.

యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారు ఈ పోర్టల్ ను బాగా ఆదరిస్తున్నారు. ఇందులో విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని, ఉద్యోగవకాశాలకు సంబంధించిన విషయాలను కూడా అందజేస్తున్నారు. అంతే కాక ఆ ప్రాంతంలోని ప్రముఖులకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ఈ పోర్టల్ చుసే వారి స్పందన కూడా అపారంగానే ఉంది. ఈ పోర్టల్ నిర్వాహకులు ఇతర చోట్ల పని చేస్తూనే ఈ పోర్టల్ ను నిర్వహిస్తున్నారు. తమ సొంత డబ్బుతోనే దీనిని నడుపుతున్నారు. విద్యావంతులైన వారి సహకారంతో వార్తలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఆదాయం సంపాదించాలనే ఆలోచన మాత్రం ఈ పోర్టల్ నిర్వాహకులకు లేదు. మీడియా సాధారణంగా పట్టించుకోని సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా అందజేస్తున్నారు.

ఈ పోర్టల్ గురించి పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఈ ప్రెస్ క్లబ్ లో మహిళలు ఎవరూ లేనందువల్ల మహిళలు వార్తలు రాయడానికి ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నారు.

నేర వార్తలు రాయడమే కాక ఆరోగ్యం, టీకాలు వేయించడం, కుటుంబ నియంత్రణ, గర్భధారణ మొదలైన విషయాలకు కూడా స్థానం కల్పించాలనుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేయడం వల్ల వారు చదువు మానేస్తున్నారు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది ముస్లింలే. ఈ పోర్టల్ మత సామరస్యాన్ని పెంపొందింపడానికి కృషి చేస్తోంది.

ఈ ప్రాంత వాసులు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన వారు కనక వారికి ఉపయోగకరమైన సమాచారం కూడా అందజేస్తున్నారు.

దీనితో పాటు ఈ ప్రెస్ క్లబ్ వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రామాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా అందజేస్తోంది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పుల కోసం తాము ప్రయత్నిస్తున్నామని దాని కోసమే ఈ పోర్టల్ నిర్వహిస్తున్నామని పోర్టల్ నిర్వహించే వారు అంటున్నారు. ఈ పోర్టల్ లో వ్యాఖ్యలు ఉండవు. వార్తలు మాత్రమే ఉంటాయి.

ఇది ఆ ప్రాంత అభివృద్ధి కోసం అంకితమైన పత్రికా రచయితల గుండె చప్పుడు.

Click on Image to Read:

purandeswari-ys-jagan

koratala-siva-vs-boyapati-srinu

ys-jagan-chit-chat

vishnukumar-raj

avanthi-srinivas-haribabu

gorantla-buchaiah-chowdary

ys-jagan-assembly

chandrababu delhi tour

ys-jagan

chandrababu naidu ap special package

kodela shiva rama krishna 1

arun jaitly press meet

why bhumana karunakar reddy not arrest

vijayawada junction 1

mla roja

vishka railway zone

sujana chowdary

babu rain guns

kodela shiva prasad rao

vijayawada railway jone

First Published:  8 Sep 2016 5:01 AM GMT
Next Story