Telugu Global
Cinema & Entertainment

కొరటాలను మెచ్చుకున్న శ్రీమంతుడు

ఎన్టీఆర్ తో లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ సినిమా చేశాడు కొరటాల శివ. తన స్టయిల్ ఆఫ్ టేకింగ్ తో, సమాజానికి సందేశాన్నిచ్చేలా మరో మంచి చిత్రాన్ని తీశాడు. కమర్షియల్ ఫార్మాట్ అంటూ ఫైట్లు, ఐటెంసాంగ్స్, పాటలకే ఫిక్స్ అయిపోతున్న ఈ రోజుల్లో… మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని కూడా కమర్షియల్ గా మార్చొచ్చని చేసి చూపిస్తున్నాడు. గతంలో శ్రీమంతుడు సినిమాను అలానే తీసి చూపించాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ ను కూడా అదే బాటలో తెరకెక్కించాడు.   […]

కొరటాలను మెచ్చుకున్న శ్రీమంతుడు
X

ఎన్టీఆర్ తో లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ సినిమా చేశాడు కొరటాల శివ. తన స్టయిల్ ఆఫ్ టేకింగ్ తో, సమాజానికి సందేశాన్నిచ్చేలా మరో మంచి చిత్రాన్ని తీశాడు. కమర్షియల్ ఫార్మాట్ అంటూ ఫైట్లు, ఐటెంసాంగ్స్, పాటలకే ఫిక్స్ అయిపోతున్న ఈ రోజుల్లో… మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని కూడా కమర్షియల్ గా మార్చొచ్చని చేసి చూపిస్తున్నాడు. గతంలో శ్రీమంతుడు సినిమాను అలానే తీసి చూపించాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ ను కూడా అదే బాటలో తెరకెక్కించాడు.

ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాను టాలీవుడ్ ప్రముఖులంతా మెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు స్వయంగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరీ అభినందనలు చెబుతుంటే… మహేష్ బాబు లాంటి హీరోలు కొరటాల శివను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఇలా జనతా గ్యారేజ్ విషయంలో హీరోలంతా ఒక్కటైపోయారు. ప్రతి ఒక్కరూ తారక్ నో లేక కొరటాలనో మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో 12లక్షల డాలర్లు ఆర్జించింది. ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఇది నాలుగోసారి.

First Published:  5 Sep 2016 2:40 AM GMT
Next Story