Telugu Global
Cinema & Entertainment

చైతూ సరసన సెట్ అయిపోయింది....

తన సరసన స్టార్ హీరోయిన్లను సెట్ చేసుకోవడంలో నాగచైతన్య ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా మరోసారి అదే పని చేశాడు చైతన్య, త్వరలోనే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం చైతు రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సాహసం శ్వాసగా సాగిపో సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మరోవైపు ప్రేమమ్ కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ […]

చైతూ సరసన సెట్ అయిపోయింది....
X

తన సరసన స్టార్ హీరోయిన్లను సెట్ చేసుకోవడంలో నాగచైతన్య ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా మరోసారి అదే పని చేశాడు చైతన్య, త్వరలోనే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం చైతు రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సాహసం శ్వాసగా సాగిపో సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మరోవైపు ప్రేమమ్ కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి విడుదలైన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు చైతూ.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సరైనోడు, నాన్నకు ప్రేమతో సినిమాలు హిట్ అవ్వడంతో రకుల్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది రకుల్. దీంతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న ధృవలో కూడా చేస్తోంది. చెర్రీతో కలిసి చేస్తున్న ధృవ కంప్లీట్ అయిన వెంటనే… చైతూతో కలిసి కొత్త సెట్స్ లోకి అడుగుపెడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై వీళ్లిద్దరి కాంబినేషన్ తెరకెక్కే అవకాశం ఉంది.

Also Read
Hyper Movie Teaser

First Published:  3 Sep 2016 10:02 PM GMT
Next Story