Telugu Global
Cinema & Entertainment

మరోసారి ప్రభాస్, మహేష్ మధ్య యుద్ధం తప్పదా...

గతంలో వారం గ్యాప్ లో ఇద్దరి సినిమాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వొచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ప్రభాస్, మహేష్ మధ్య మరోసారి బాక్సాఫీస్ వార్ తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. బాహుబలి సినిమా గ్రాండ్ విడుదలై, సూపర్ హిట్ టాక్ తో, వసూళ్ల ప్రభంజనంతో కొనసాగుతున్న టైమ్ లో శ్రీమంతుడును విడుదల చేశాడు మహేష్. బాహుబలి వచ్చిన వారం రోజులకే శ్రీమంతుడు విడుదలైంది. అటు బాహుబలి, ఇటు శ్రీమంతుడు రెండూ […]

మరోసారి ప్రభాస్, మహేష్ మధ్య యుద్ధం తప్పదా...
X

గతంలో వారం గ్యాప్ లో ఇద్దరి సినిమాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వొచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ప్రభాస్, మహేష్ మధ్య మరోసారి బాక్సాఫీస్ వార్ తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. బాహుబలి సినిమా గ్రాండ్ విడుదలై, సూపర్ హిట్ టాక్ తో, వసూళ్ల ప్రభంజనంతో కొనసాగుతున్న టైమ్ లో శ్రీమంతుడును విడుదల చేశాడు మహేష్. బాహుబలి వచ్చిన వారం రోజులకే శ్రీమంతుడు విడుదలైంది. అటు బాహుబలి, ఇటు శ్రీమంతుడు రెండూ హిట్ అయ్యాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో బాహుబలి-2 విడుదల కాబోతోంది. ఈసారి కూడా బాహుబలి-2కు అటుఇటుగా వారం రోజుల తేడాలో మహేష్ బాబు సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మురుగదాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అటు బాహుబలి -2ను కూడా ఏప్రిల్ 28న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సో.. ఈసారి కూడా మహేష్, ప్రభాస్ మధ్య వార్ తప్పకపోవచ్చని అంతా అంచనా వేస్తున్నారు.

Also Read
Hyper Movie Teaser

First Published:  3 Sep 2016 11:38 PM GMT
Next Story