Telugu Global
Cinema & Entertainment

రెస్ట్ తీసుకుంటున్న బాహుబలి

ప్రస్తుతం బాహుబలి రెస్ట్ తీసుకుంటున్నాడు. దాదాపు 11 వారాల పాటు నిర్వహించిన సుదీర్ఘమైన షెడ్యూల్ పూర్తయిపోవడంతో… యూనిట్ కు కొన్ని రోజులు విరామం ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి. దీంతో అంతా రిలాక్స్ అయ్యారు. బాహుబలి-2కు సంబంధించి ఏకంగా 10వారాల భారీ షెడ్యూల్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించారు. రానా, ప్రభాస్ మధ్య వచ్చే వార్ సీక్వెన్స్ తో పాటు అనుష్క, తమన్నాలతో కూడా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. అయితే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ […]

రెస్ట్ తీసుకుంటున్న బాహుబలి
X

ప్రస్తుతం బాహుబలి రెస్ట్ తీసుకుంటున్నాడు. దాదాపు 11 వారాల పాటు నిర్వహించిన సుదీర్ఘమైన షెడ్యూల్ పూర్తయిపోవడంతో… యూనిట్ కు కొన్ని రోజులు విరామం ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి. దీంతో అంతా రిలాక్స్ అయ్యారు. బాహుబలి-2కు సంబంధించి ఏకంగా 10వారాల భారీ షెడ్యూల్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించారు. రానా, ప్రభాస్ మధ్య వచ్చే వార్ సీక్వెన్స్ తో పాటు అనుష్క, తమన్నాలతో కూడా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. అయితే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో జాప్యం వల్ల షెడ్యూల్ ను మరో 10రోజుల పాటు పొడిగించాల్సి వచ్చింది. అలా 11 వారాల పాటు ఏకథాటిగా షూటింగ్ పూర్తిచేసుకుంది బాహుబలి-2 సినిమా. ఈ భారీ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి కీలకమైన మేజర్ టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలోనే మరో షెడ్యూల్ వివరాల్ని ప్రకటిస్తారు. కొత్త షెడ్యూల్ లో డైలాగ్ పార్ట్ తో పాటు… రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్ లో పాటను చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలని నిర్ణయించారు.

First Published:  2 Sep 2016 10:27 PM GMT
Next Story